కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : బండి సంజయ్

కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : బండి సంజయ్

కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందా చేసేటోళ్ల అంతు చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగూళురు డ్రగ్స్ స్కాం కేసును మూయించింది కేసీఆరేనన్న బండి సంజయ్... ఆ కేసును మళ్లీ తిరగదోడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడాల్సిందేనని పట్టుబట్టారు. ప్రజల సొమ్మును దోచుకుంటూ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాల్జేస్తున్నారని ఆరోపించారు. ట్విట్టర్ టిల్లు.... మిషన్ భగీరథ నీళ్లేవి? అని నిలదీశారు.

డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, దళిత బంధు హామీలేమైనయ్? అని బండి సంజయ్ ప్రశ్నించారు. రోడ్లు, నీళ్లు, కనీస సౌకర్యాల్లేక రాష్ట్రం అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ ను గ్రామగ్రామాన నిలదీయండని చెప్పారు. గ్రామాల అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని తెలిపారు. ఒక్క ఓలా గ్రామానికే రూ.3.89 కోట్లకు పైగా కేంద్రం నిధులిచ్చిందని స్పష్టం చేశారు.