రహస్యమేమీ లేదు : ట్రంప్ తో భేటీ గురించే బీజింగ్ లో మోదీకి వివరించా: పుతిన్

రహస్యమేమీ లేదు : ట్రంప్ తో భేటీ గురించే బీజింగ్ లో మోదీకి వివరించా: పుతిన్

బీజింగ్: ఇటీవల షాంఘై సహకార సంస్థ(ఎస్ సీఓ) సదస్సు సమయంలో భారత ప్రధాని మోదీ తన కారులో ప్రయాణించినపుడు రహస్య విషయాలేవీ మాట్లాడలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. గురువారం బీజింగ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘మోదీతో నేను నా కారులో ప్రయాణిస్తున్నపుడు సీక్రెట్ విషయాలేవీ మాట్లాడలేదు. ఇటీవల ట్రంప్ తో జరిగిన భేటీ గురించి మాత్రమే వివరించాను” అని పుతిన్ తెలిపారు. కాగా,  తియాంజిన్ లో ఎస్ సీవో సమిట్ వేదిక వద్దకు చేరుకోవడానికి మోదీకి పుతిన్ తన కారులో లిఫ్ట్ ఇచ్చారు. ముందుగా 15 నిమిషాలు ఇరువురు నేతలు కారులో పలు విషయాలు చర్చించుకున్నారు. కారు వేదిక వద్దకు చేరుకున్నప్పటికీ మరో 45 నిమిషాలు వెహికల్ లోనే ఉండి మాట్లాడుకున్నారు.