నా ఫామ్‌‌‌‌పై టెన్షన్‌‌‌‌ లేదు

నా ఫామ్‌‌‌‌పై టెన్షన్‌‌‌‌ లేదు
  • స్పిన్​ వికెట్లపై మనోళ్లకూ సవాల్​ తప్పదు: రహానె

కాన్పూర్‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌ ఫామ్‌‌‌‌ విషయంలో తనకు ఎలాంటి టెన్షన్‌‌‌‌ లేదని టీమిండియా స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అజింక్యా రహానె అన్నాడు. టీమ్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ ఉంటుందా? పోతుందా ? లాంటి అంశాలు ఆలోచిస్తూ ఫ్యూచర్‌‌‌‌ గురించి భయపడనని తెలిపాడు. న్యూజిలాండ్‌‌‌‌తో టెస్టు మ్యాచ్‌‌‌‌కు  ముందు రహానె మీడియాతో మాట్లాడాడు.  ‘టీమ్‌‌‌‌కు ఉపయోగపడే విధంగా ఆడటమే నా పని. దానిపైనే నా ఫోకస్‌‌‌‌ ఉంటుంది. అలాగని సెంచరీ చేస్తేనే టీమ్‌‌‌‌కు ఉపయోగపడినట్టు కాదు. చేసింది 30, 40 రన్స్‌‌‌‌ అయినా వాటికీ ప్రాధాన్యముంటుంది. అలాగే నేను  ఫ్యూచర్‌‌‌‌ గురించి పెద్దగా ఆలోచించను. ఈ మూమెంట్‌‌‌‌లో ఉండేందుకు ప్రయత్నిస్తా. ఇక, ఈ మేము ఆడుతున్నది హోమ్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లోనే కావొచ్చు. కానీ స్పిన్‌‌‌‌ ఫ్రెండ్లీ వికెట్లపై ఆడటం మాకూ సవాలే. పరిస్థితులకు అనుగుణంగా ఆడటంపైనే ఫోకస్‌‌‌‌ పెట్టాం’ అని రహానె చెప్పుకొచ్చాడు.