పోలీసు ఉద్యోగాలకు హెవీ కాంపిటిషన్

పోలీసు ఉద్యోగాలకు హెవీ కాంపిటిషన్
  • మొత్తం ఎస్ఐ పోస్టులు: 587
  • దరఖాస్తు చేసుకున్నోళ్లు: 2.47 లక్షలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పోలీస్‌‌‌‌ ఉద్యోగ నియామకాలకు అప్లికేషన్ల గడువు గురువారంతో ముగిసింది. తెలంగాణ స్టేట్‌‌‌‌ లెవల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ (టీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌బీ) వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ద్వారా మే 2 నుంచి మే26 రాత్రి10 గంటల వరకు ఆన్‌‌‌‌లైన్ అప్లికేషన్‌‌‌‌ ప్రక్రియ కొనసాగింది. గడువు ముగిసే సమయానికి 7,33,559 మంది అభ్యర్థులు12,91,006 దరఖాస్తులను సబ్మిట్ చేశారు. పోస్టులు, రిజర్వేషన్ల వారీగా వచ్చిన అప్లికేషన్ల వివరాలను టీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌బీ చైర్మన్‌‌‌‌ శ్రీనివాస్​రావు శుక్రవారం వెల్లడించారు. 2018తో పోలిస్తే  ఈసారి అప్లికేషన్లు భారీగా పెరిగినట్లు తెలిపారు. అప్పటి నోటిఫికేషన్‌‌‌‌లో 18,428 పోస్టులకు 7,19,840 దరఖాస్తులు వచ్చాయన్నారు. యూనిఫామ్ సర్వీసెస్‌‌‌‌లో ఏజ్ లిమిట్ పెంచడంతో అదనంగా సుమారు 1.4 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం దక్కింది. 
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు పోటీ ఇలా.. 
సివిల్ పోలీస్‌‌‌‌, ఎస్‌‌‌‌పీఎఫ్‌‌‌‌, ఫైర్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌, జైళ్ల శాఖలో 587 ఎస్సై స్థాయి పోస్టులకు 2,47,630 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా, ఒక్కో పోస్టుకు 454 మంది పోటీ పడుతున్నారు. ఇందులో సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్ ఎస్సై పోస్టులు 545 ఉన్నాయి. వీటిలో ఒక్కో పోస్టుకు 554 మంది పోటీ పడుతున్నారు. 16,929 కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు 9,54,064 దరఖాస్తులు రాగా, ఒక్కో పోస్టుకు 56 మంది పోటీ పడుతున్నారు.
15,271 ఉన్న సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు గాను, ఒక్కో పోస్టుకు 65 మంది పోటీ పడుతున్నారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్స్‌‌‌‌లో 22 ఎస్సై పోస్టులు ఉండగా14,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్ ట్రాన్స్​పోర్ట్ ఎస్సై పోస్టులు మూడే ఉండగా 3,533 అప్లికేషన్లు వచ్చాయి. 262 కానిస్టేబుల్ పోస్టులకు22,033 మంది అప్లై చేశారు. ఫింగర్ ప్రింట్స్‌‌‌‌ బ్యూరోలో 8 ఏఎస్సై పోస్టులకు 6,010, ఫైర్ సర్వీసెస్‌‌‌‌లో 225 డ్రైవర్‌‌‌‌ పోస్టులకు 27,032, ఆపరేటర్‌‌‌‌‌‌‌‌ పోస్టులకు11,028 దరఖాస్తులు వచ్చాయి. 21 మెకానిక్ పోస్ట్‌‌‌‌ల కోసం5,228 మంది అప్లై చేసుకున్నారు. 
ప్రాసెస్ షురూ చేసినం 
ఆగస్ట్‌‌‌‌ 7న ఎస్సై, 21న కానిస్టేబుల్‌‌‌‌ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎస్సైఐ స్థాయి పరీక్షకు 2.5 లక్షల మంది, కానిస్టేబుల్ స్థాయి పరీక్షకు 6.6 లక్షల మంది అటెండ్‌‌‌‌ కానున్నారు. ఇందుకోసం అవసరమైన ప్రాసెస్ ప్రారంభించాం.  - వి.వి. శ్రీనివాస్‌‌‌‌ రావు, చైర్మన్, టీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌బీ

 

ఇవి కూడా చదవండి

విశ్వవిఖ్యాతకు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు

ఎన్టీఆర్ ఒక ప్రభంజనం..ఒక సంచలనం

ఇంటర్​లో కొత్త కోర్సులు

దమ్ముంటే మీరు పార్లమెంట్‌ రద్దు చేయండి.. మేం అసెంబ్లీని రద్దు చేయిస్తం

ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు