పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరగాలి

పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరగాలి

దేశ ప్రయోజనాల కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోడీ అన్నారు.  సభ్యులందరూ అర్థవంతమైన చర్చలు, విమర్శలు చేయాలని కోరారు. అందరి సభ్యుల సహకారంతో పార్లమెంటు సమావేశాలు విజయవంతం అవుతాయని మోడీ ధీమా వ్యక్తం చేశారు. సమస్యలపై లోతుగా విశ్లేషించాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల కాలం ఎంతో ముఖ్యమైనదని మోడీ చెప్పారు. మరో 25 ఏళ్లలో స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతుంది. మన దేశ అభివృద్ధి, స్థితిగతులను నిర్ణయించేది ఈ 25 ఏళ్లే అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి ఎన్నికలు జరుగుతున్నందున.... ఈ సెషన్ ముఖ్యమైందన్నారు. కొత్త ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ దేశానికి మార్గనిర్దేశకం చేయనున్నారని ప్రధాని మోడీ తెలిపారు.