ఆర్మూర్ టౌన్ లో సిద్ధులగుట్టపై భక్తుల సందడి

ఆర్మూర్ టౌన్ లో  సిద్ధులగుట్టపై  భక్తుల సందడి

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ లో  సిద్దులగుట్టపై  సోమవారం భక్తులు సందడి నెలకొంది.  శివాలయం, రామాలయం, అయ్యప్ప, దత్తాత్రేయ మందిరాలకు భక్తులు పోటెత్తారు.   పురోహితులు కుమార్ శర్మ, నందీశ్వర మహారాజ్​ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయం  నుంచి జీవ కోనేరు వరకు ఉత్సవ మూర్తులతో పల్లకిసేవ జరిపారు. మందిర కమిటి ఆధ్వర్యంలో అన్నదానం  నిర్వహించారు.  

నిర్మల్​, నిజామాబాద్​, హైదరాబాద్​, కరీంనగర్​ జిల్లాలతో పాటు స్థానిక భక్తులతో కలిపి  దాదాపు 15 వేల మంది భక్తులు గుట్టపైకి వచ్చారని మందిర కమిటి వారు తెలిపారు. ఆషాడమాసం రెండవ సోమవారం గుట్టపైన శివాలయంలో గాజుల పూజ నిర్వహిస్తామని, అనంతరం పూజకు హాజరైన మహిళలకు శివాలయంలో అలంకరణ చేసిన గాజులను పంపిణీ చేస్తామని  తెలిపారు.