గణేశ్ ఉత్సవాల్లో 16 వందల12 మంది చిల్లరగాళ్లు.. ఇందులో 68 మంది మైనర్లే.. వృద్ధులు ఎంద మంది అంటే..

గణేశ్ ఉత్సవాల్లో 16 వందల12 మంది చిల్లరగాళ్లు.. ఇందులో 68 మంది మైనర్లే.. వృద్ధులు ఎంద మంది అంటే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో గణేశ్​ఉత్సవాల సందర్భంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 1,612 మంది చిల్లరగాళ్లను షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్​గా పట్టుకుంది. నిమజ్జనం ప్రాంతాలు, ఉత్సవ వేదికల వద్ద నిఘా పెట్టి పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో 1,544 మంది మేజర్లు, 68 మంది మైనర్లు ఉన్నారు.  

మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు చెప్పామని షీటీమ్స్​ప్రకటించింది. నిందితుల్లో 21–-30 ఏండ్ల వయస్సువారు 646 మంది,18–-20 ఏండ్ల వారు 290, 31–-40 మధ్య వయస్సున్న వారు 397 మంది, 41–-50 ఏండ్లవారు 166 మంది ఉన్నారు. 50 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సున్న వాళ్లు 45 మంది ఉన్నట్లు షీ టీమ్స్ ప్రకటించింది. 

10 కేసుల్లో నిందితులకు నాంపల్లి కోర్టు రూ.50- చొప్పున, 59 కేసుల్లో రూ.1,050- చొప్పున జరిమానా విధించిందని షీ టీమ్స్​ప్రకటించింది. ఒక కేసులో నిందితుడికి 2 రోజుల సాధారణ జైలు శిక్ష వేసిందన్నారు.