అక్కడ వీసా లేకుండా 30రోజులు ఉండొచ్చు

అక్కడ వీసా లేకుండా 30రోజులు ఉండొచ్చు

ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే ఒకటో రెండో స్పెషల్ ప్లేస్​లు ఉంటాయి. కానీ, ఇక్కడికి వెళ్తే మాత్రం అక్కడున్న స్పెషల్ ప్లేస్​లన్నీ చూసి రావడానికి టైమ్​ సరిపోదు. ఒక్కోటి ఒక్కో స్పెషాలిటీతో మనసు దోచేస్తాయి. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. అందుకే ‘ది ల్యాండ్ ఆఫ్ గాడ్స్’ అని పిలుస్తారు. చలికాలం, వానాకాలం ఈ రెండు సీజన్లే ఉంటాయి. ఒకసారి వెళ్తే మళ్లీ మళ్లీ రావాలి అనిపించేంత     ఈ ప్లేస్‌‌‌‌ ఇండోనేసియాలో ఉన్న ఐలాండ్ ‘బాలి’. 

బాలిలో టెంపుల్స్​తో పాటు కుటా, నుసా దువ, సానుర్, ఉలువాటు, బడంగ్ బడంగ్, డ్రీమ్ ల్యాండ్, బిన్జిన్ బీచ్​లు స్పెషల్ అట్రాక్షన్స్​. అంతేకాకుండా సర్ఫింగ్, ట్రెక్కింగ్, డైవింగ్‌‌‌‌లతో పాటు రకరకాల వాటర్ స్పోర్ట్స్, క్వాడ్ బైక్ టూర్, వైట్ వాటర్ రాఫ్టింగ్​లు చేయొచ్చు. 

తానా లాట్ టెంపుల్ 
ఇది సముద్ర తీరంలోని అతి పెద్ద రాయిపై కట్టిన టెంపుల్. చూడ్డానికి చిన్న ఐలాండ్​లా ఉంటుంది. ఇక్కడ సముద్ర దేవుడిని పూజిస్తారు. సముద్ర కెరటాల వల్ల ఈ రాయి కింద ఏర్పడిన సొరంగం కింద నుంచి సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుంది. ‘తానా లాట్’ అంటే ‘సముద్రం లోపల’ అని అర్థం.

ఉలువాటు టెంపుల్
బాలిలో సముద్ర తీరంలో కొండ అంచున ఉంది ‘ఉలువాటు’ టెంపుల్. ఇది సముద్రమట్టానికి సుమారు 70 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ టెంపుల్​లో శివుడ్ని పూజిస్తారు. ఇక్కడ బాలి ట్రెడిషనల్ డాన్స్​లు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. 


బెసాకి టెంపుల్
బాలిలోని మెయిన్​ టెంపుల్​ ఇది. ఈ ఒక్క టెంపుల్ కాకుండా... చిన్న టెంపుల్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. శివుడు, బ్రహ్మ, విష్ణువుల ఆలయాలు బెసాకి టెంపుల్​​ కాంప్లెక్స్​లో ఉన్నాయి. ఈ దీవి సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉన్న ‘అగుంగ్ మౌంటెన్​’పై ఉంది. దీన్ని ‘మదర్ టెంపుల్ ఆఫ్ బాలి’గా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపు 70 వేడుకలు జరుగుతాయి.ఈ టెంపుల్​ని 8వ శతాబ్దంలో సాధువులు కట్టించారని చెబుతారు.


వరి పొలాలు
టెగల్లలంగ్, జటిలువి ప్రాంతాల్లో వరి చేలు కనిపిస్తాయి. పర్వతాలపై పండించే వరి చేలు, కొబ్బరి తోటలు కనువిందు చేస్తాయి. ఈ రెండు ప్రాంతాల్లోని పొలాలకు నీళ్లు సమానంగా సరఫరా చేస్తారు. కాబట్టి ఆ మేనేజ్​మెంట్ కో – ఆపరేటివ్ సిస్టమ్​ని ‘సుబక్’ అంటారు. 9వ శతాబ్దంలోనే యునెస్కో దీనికి బెస్ట్ ఇరిగేషన్​ సిస్టమ్​గా గుర్తించింది.


బటుర్ అగ్నిపర్వతం
బటుర్ అగ్నిపర్వతం కింటమనీ ప్రాంతంలో ఉంది. ఆ పర్వతం1800 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 27 సార్లు పేలింది. కింటమనీ అగ్ని పర్వతంపై వెదురు చెట్లను పెంచుతున్నారు. ఆ వెదురుతోనే బాలి ప్రజలు ఫర్నిచర్ తయారుచేసుకుంటారు. 


మెరైన్ పార్క్
ఇది బాలిలో ఉన్న అతిపెద్ద యానిమల్ థీమ్ పార్క్. ఇక్కడ దాదాపు 60 జాతుల జంతువులు ఉంటాయి. వీటిని బస్సులో ట్రావెల్ చేస్తూ చూడొచ్చు. ఇక్కడ యానిమల్ టాలెంట్ షోలు కూడా జరుగుతాయి.

గోవా గజ
‘గోవా గజ’ అంటే ‘ఏనుగు గుహ’ అని అర్థం. బాలిలోని గియాన్యర్ ప్రాంతంలో ఉంది ఈ గుహ. ఈ ప్రాంతంలో ఉన్న రాతి శిల్పాలు ఆకట్టుకుంటాయి.11వ శతాబ్దానికి చెందిన ఈ ప్రాంతంలో ఒకప్పుడు ‘పెతాను’ నది ప్రవహించేదట. దాన్ని అప్పట్లో గజా నది అని పిలిచేవారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి గోవా గజా అనే పేరు వచ్చిందంటారు. ఈ గుహ లోపల వినాయకుడి విగ్రహం ఉంది.

వాటర్ టెంపుల్
ఈ టెంపుల్​ని1663లో కట్టారు. ఇది ‘బ్రతన్’ సరస్సు తీరంలో ఉంది. దీన్ని హిందూ వాటర్ టెంపుల్ లేదా ‘పురా ఉలున్ దాను బ్రతన్’ అంటారు. ఇది పదకొండు అంతస్తులతో టవర్ ఆకారంలో ఉంటుంది. ఈ టెంపుల్​లో ‘దేవీ దాను’ అనే జల దేవతను పూజిస్తారు. బాలిలో గుడులు, అడవులు, మ్యూజియాలతో పాటు బీచ్‌‌‌‌లు కూడా ఉన్నాయి. బాలిలో హోటల్ రూమ్​లు రెండువేల రూపాయల నుంచి దొరుకుతాయి. స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి.

మంకీ ఫారెస్ట్ 
ఉబుద్​లో ఉన్న ఈ ఫారెస్ట్​... కోతులకు పెట్టింది పేరు. ఈ అడవిలో ఎటు చూసినా కోతుల హంగామానే కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘మంకీ ఫారెస్ట్’ అంటారు. అంతేకాకుండా ఇక్కడ డ్రాగన్ రూపంలో ఉన్న బ్రిడ్జ్​లు, వెరైటీ శిల్పాలతో కట్టిన టెంపుల్స్​ టూరిస్ట్​లను ఆకట్టుకుంటాయి. ఈ ఫారెస్ట్​లో కూడా గుడులు ఉన్నాయి. వాటిలో మొదటిది14వ శతాబ్దానికి చెందిన ‘పురా దాలెమ్ అగూంగ్ పడంగ్టెగల్’. ఇక్కడ వందలాది కోతులు కనిపిస్తాయి. రెండోది ‘హోలీ స్పింగ్ టెంపుల్, మూడోది ‘ప్రజాపతి టెంపుల్’. ఉబుద్​లో ఆర్ట్, కల్చర్​కి చాలా ఇంపార్టెన్స్​ ఉంది. వాళ్ల ఆచారాలు, కళలు తెలుసుకోవడానికి  అగూంగ్ రాయ్, నెకా, సెటియా ధర్మ హౌస్​ ఆఫ్​ మాస్క్స్ అండ్ పప్పెట్స్​, పూరి లుకిసన్, డాన్ ఆన్టోనియో బ్లాన్కో వంటి ఆర్ట్ మ్యూజియాలు ఇక్కడ ఉన్నాయి. 

బాలి మైనా
ఈ పక్షి బాలి ఐలాండ్​కి నేషనల్ సింబల్. దీన్ని 1912లో కనుగొన్నారు. దీన్ని బాలి మైనా, బాలి స్టార్లింగ్, రోత్సచైల్డ్స్ మైనా అనే పేర్లతో పిలుస్తారు. లోకల్​గా జలక్ బాలి అని పిలుస్తారు. ప్రస్తుతం వీటి జాతి అంతరించిపోయే దశలో ఉంది.

ఇలా వెళ్లొచ్చు
వైజాగ్, హైదరాబాద్ నుంచి బాలికి డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు. కౌలాలంపూర్​ వెళ్లి ​అక్కడి నుంచి బాలి ఫ్లైట్ ఎక్కాలి. బాలి వెళ్లేందుకు వీసా అవసరంలేదు. పాస్‌‌‌‌పోర్ట్ ఉంటే... ‘వీసా ఆన్ ఎరైవల్’ ఫెసిలిటీతో వెళ్లొచ్చు. వీసా లేకుండా 30 రోజులు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం వీసా కావాల్సిందే.