అంతర్గాంలో ఎయిర్పోర్టు ఏర్పాటయ్యే వరకు విశ్రమించేది లేదు: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

అంతర్గాంలో ఎయిర్పోర్టు ఏర్పాటయ్యే వరకు విశ్రమించేది లేదు: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ప్రీ ఫిజిబులిటీ స్టడీ ఫీజు కోసం ఎయిర్​పోర్టు అథారిటీకి రూ.40.53 లక్షలు చెల్లింపు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో గ్రీన్​ ఫీల్డ్​ ఎయిర్​పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. అంతర్గాం మండల కేంద్రంలో ఎయిర్​పోర్టు నిర్మాణం కోసం 591 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఎయిర్​ పోర్టు నిర్మాణం సాధ్యమవుతుందా అనే విషయమై ప్రీ ఫిజిబులిటీ స్టడీ చేసేందుకు రూ.40.53 లక్షల ఫీజును ఎయిర్​ పోర్టు అథారిటీ ఆఫ్​ ఇండియాకు చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్​ ఛీప్​ సెక్రటరీ వికాస్​ రాజ్​ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

గతంలో పాలకుర్తి మండలం బసంత్​నగర్​ వద్ద ఉన్న స్థలంలో ఎయిర్​ పోర్టు ఏర్పాటు సాధ్యంకాదని ఎయిర్​ పోర్టు అథారిటీ ఆఫ్​ ఇండియా ఆఫీసర్లు స్టడీ చేసి తేల్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అంతర్గాంలో స్థలాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఎయిర్​పోర్టు అథారిటీ ఆఫ్  ఇండియా ఆఫీసర్లు వచ్చి స్టడీ చేసిన తర్వాత ఇచ్చే రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. 

ఎయిర్​పోర్టు ఏర్పాటయ్యే వరకు విశ్రమించేది లేదు

రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పెద్దపల్లి జిల్లా ప్రజలకు అంతర్గాం ఎయిర్​పోర్టు వల్ల ఉపయోగం ఉంటుంది. హైదరాబాద్​కు రోడ్డు మార్గంలో గంటలకొద్దీ ప్రయాణం చేయకుండా ఎయిర్​ కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంతర్గాంలో గ్రీన్​ ఫీల్డ్​ ఎయిర్​పోర్టు ఏర్పాటయ్యే వరకు విశ్రమించేది లేదు. 

రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్​పోర్టు అథారిటీ ఆఫ్​ ఇండియాకు ప్రీ ఫిజిబులిటీ స్టడీ కోసం రూ.40.53 లక్షల ఫీజు చెల్లించడం చారిత్రాత్మక ముందడుగు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నా. కాకా వెంకటస్వామి స్ఫూర్తితో పెద్దపల్లి ప్రజలు ఇచ్చిన మద్దతుతో అంతర్గాంలో ఎయిర్​పోర్టు ఏర్పాటయ్యే వరకు కృషి చేస్తా.
- గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ