హోం మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి?

హోం మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి?

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం చుట్టూ నెలకొన్న వివాదంపై అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై చేసినవి తప్పుడు ఆరోపణలని, ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలోని హోటళ్లు, బార్లు, పబ్‌ల నుంచి నెలకు కనీసం వందకోట్లు వసూలు చేయాలని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పోలీసుల్ని ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీస్ కమీషనర్ పరమ్‌వీర్ సింగ్ ఆరోపించడం సంచలనంగా మారింది. 

ప్రతిపక్షాలు హోంమంత్రి అనిల్ దేశ్‌‌ముఖ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. రాజీనామా చేయాలంటున్న బీజేపీవి చెత్త రాజకీయాలని విమర్శించారు. ‘రాజీనామా చేసే సాంప్రదాయం ఇక్కడ లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు పదవిలోనే కొనసాగితే విచారణ నిష్పాక్షికంగా జరగదని ఎవరన్నారు? అసలు ఆ లెటర్ పరంబీర్ సింగ్ రాశారా అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. ఆ లేఖను ఇతరులు రాసి ఉండొచ్చు. దానిపై పరంబీన్ సంతకం చేసి ఉండొచ్చు. మా దృష్టిలో ఈ వివాదం ముగిసినట్లే’ అని రౌత్ చెప్పారు.