మీ చర్మం స్వచ్ఛంగా ఉండాల.. జస్ట్ ఈ జ్యూస్, టిని తాగి చూడండి..

మీ చర్మం స్వచ్ఛంగా ఉండాల.. జస్ట్ ఈ జ్యూస్, టిని తాగి చూడండి..

ప్రతిఒక్కరు చర్మ సౌందర్యం కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇంకా ఈ కాలంలో అయితే ముఖ్యంగా మహిళలు చాల రకాల అలవాట్లు పాటిస్తుంటారు. అయితే  చర్మ సౌందర్యం ప్రభావం కావటానికి ఏంటి కారణం, చర్మ సౌందర్యంని ఎలా కాపాడుకోవాలి  అని ఎప్పుడైనా ఆలోచించారా.. 

మన శరీర ఆరోగ్యం చాల కారణాల వల్ల  ప్రభావం అవుతుంది. ఇందుకు ముఖ్యమైన విషయం ఏంటంటే పేగు ఆరోగ్యం. చర్మం లేదా హార్మోన్ల బ్యాలెన్స్ వంటి సంబంధం లేని చోట్ల కూడా పేగు ఆరోగ్యం  ప్రాభావమైతే  లేదా క్షిణిస్తే చాల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల మనం తాగే కొన్ని పానీయాలు ముఖ్యంగా  పరిగణనలోకి తీసుకోవాలి.

 ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వీడియోలో ప్రముఖ డాక్టర్ సౌరభ్ సేథి శరీర ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపే మూడు పానీయాలను సిఫార్సు చేస్తున్నారు. అయితే ఇది వైద్య సలహా కాదు. కానీ మీరు మొటిమలతో ఇబ్బంది పడుతున్న లేదా  చాల రకాల ప్రయత్నాలు చేసి విసుగు చెందితే  ఈ పానీయాలు మీకు చాల ఉపయోగపడొచ్చు. ఇతని ఇన్స్ట అకౌంటుకి  1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. 

స్పియర్మింట్ టీ : చర్మం శరీరంలోని అతిపెద్ద అవయవం అలాగే వ్యాధిలను నివారించడానికి దాని పట్ల మనం  శ్రద్ధ వహించాలి. సాధారణంగా ప్రజలు స్పష్టమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని కోరుకుంటారు. స్పష్టమైన, ఆరోగ్యకరమైన చర్మం పొందటానికి అలాగే  మొటిమలను తగ్గించడానికి స్పియర్‌మింట్ టీ బెస్ట్  పానీయాలలో ఒకటి. ఇది హార్మోన్లను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది ఇంకా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)తో బాధపడుతున్నవారికి  వారికి చాల ఉపయోగపడుతుంది.

టార్ట్ చెర్రీ జ్యూస్:  టార్ట్ చెర్రీ జ్యూస్ మీ ఆహారంలో ఉండాల్సిన  ఒక విలువైన పానీయం, ఎందుకంటే ఇది కండరాలు తిరిగి ఆరోగ్యంగ ఉండటానికి ఉపయోగపడే  బెస్ట్ వాటిలో ఒకటి. ఇందులో సహజ యాంటీఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ఫ్లమేటరీ  అయిన ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తీవ్రమైన వ్యాయామం వల్ల కలిగే ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. ఈ టార్ట్  చెర్రీ జ్యూస్ మీ నిద్రను కూడా మెరుగుపరుస్తుంది, దీని సహజ మెలటోనిన్ కంటెంట్‌ శరీరం కోలుకునే ప్రక్రియకు చాలా సహాయం  చేస్తుంది. 

ALSO READ : బీరు తాగితే ఆరోగ్యానికి ఇన్ని లాభాలా.. పొట్ట రాదు.. బీపీ పెరగదు.. గుండెపోట్లు తక్కువ..!

చమోమిలే టీ: మంచి నిద్ర కోసం చమోమిలే టీ బెస్ట్ పానీయం. దీని గురించి ఇప్పటికే చాల మందికి  తెలిసి ఉంటుంది. ఎందుకంటే చమోమిలే అపిజెనిన్ అత్యంత సహజ వనరులలో ఒకటి అని అధ్యయనాలు చెబుతున్నాయి, ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.