మహానాడులో మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాలు ఇవే..!

మహానాడులో మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాలు ఇవే..!

టీడీపీ అంటేనే పేదల పార్టీ.. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యమని  మంత్రి నారా లోకేష్ అన్నారు. కడపలో మూడు రోజుల పాటు జరగనున్న తెలుగు దేశం పార్టీ మహనాడు కార్యక్రమం తొలిరోజు ఆయన ప్రసంగించారు.  తెలుగుజాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ  టీడీపీ అని.. తమకు అధికారం కొత్త కాదు.. ప్రతి పక్షం కొత్తకాదని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. 

ALSO READ | రూ. 500 నోట్లు రద్దు చేయాలి.. చంద్రబాబు సంచలన డిమాండ్..

సమాజంలో మహిళలను చులకనగా చూసే పరిస్థితి మారిపోవాలని.. మారుతున్న కాలానికి తగినట్లుగా పార్టీ కూడా మారాలని అన్నారు.  పార్టీలో 58 మంది మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారని.. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల 347 మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని ఈ సందర్భంగామంత్రి లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా ‘‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’’ అనే పేరున ఆయన ఆరు శాసనాలను ప్రతిపాదించారు. 

మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాలు:

1. తెలుగుజాతి విశ్వఖ్యాతి, 
2. యువగళం,
3. స్త్రీ శక్తి, 
4. పేదల సేవల్లో సోషల్‌ రీఇంజనీరింగ్‌, 
5. అన్నదాతకు అండగా,
 6. కార్యకర్తే అధినేత