
మనిషి చివరి క్షణాలు ఎంతో ప్రత్యేకమైనవి. మరణం అంచున ఉన్నప్పడు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు కనిపిస్తాయట. తను ఎంత సంపాదించానో.. ఏం ఏం వెనకేసుకున్నానో కూడా గుర్తు ఉండవు. కేవలం తన ఎవరితో ఉన్నాడు.. ఎవరి ప్రేమను పొందాడో అన్న జ్ఞాపకాలే గుర్తొస్తాయట. ఈ విషయాలన్నీ ఒకప్పుడు సైంటిస్టులు రుజువు చేసినవే. అయితే, తాజాగా అమెరికాకు చెందిన సైంటిస్టులు ఓ స్టడీ చేశారు. ఈ స్టడీలో చనిపోయే ముందు వ్యక్తులు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారో ఓ నివేదికలో పేర్కొంది.
ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలకు దూరం అవుతున్నారు. వృద్దాప్యంలో పిల్లల ప్రేమకు దూరం అవుతున్నారు. అనాధాశ్రమాల్లో ఉంటున్నారు. ఇలాంటివాళ్లు చనిపోయే టైంలో వాళ్ల పిల్లలను తలుచుకుంటారట. వాళ్లను గుర్తుచేసుకుని ఏడుస్తారట. పిల్లల్ని చూడాలని ఆరాట పడతారట.
ఇంకొంతమంది జీవితంలో వాళ్లు చేసిన తప్పులను గుర్తు చేసుకుని బాధ పడతారు. ఆ తప్పులకు క్షమాపణలు కోరుతుంటారు. పశ్చాతాపంతో కుమిలిపోతుంటారు. జీవితంలో వాళ్లు ఇబ్బంది పట్టిన వాళ్లకు సారీ చెప్తుంటారు.
చివరి క్షణాల్లో మరికొంతమంది తమ తీపి జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. పిల్లలు, ఫ్రెండ్స్ తో సరదాగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటారు. వాళ్ల గడిపిన ఆనంద క్షణాలకు కారణం అయిన వాళ్లకు థాంక్యూ చెప్తుంటారు. తమకు ఇష్టమైన వాళ్ల పేర్లను పదే పదే తలుచుకుంటుంటారు.