FD రేట్లు: రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై.. వడ్డీరేట్లు పెంచిన ప్రముఖ బ్యాంకులు

FD రేట్లు: రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై.. వడ్డీరేట్లు పెంచిన ప్రముఖ బ్యాంకులు

FD Rates: ఇటీవల ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ముఖ్యంగా ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచాయి. నాన్ విత్ డ్రావబుల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచాయి. నాన్ విత్ డ్రావబుల్ డిపాజిట్లు అంటే మెచ్యూరిటీ కి ముందుకు ఫండ్స్ విత్ డ్రా చేసుకునే ఆప్షన్ లేని డిపాజిట్లు. 

అంటే ప్రీ మెచ్యూర్ విత్ డ్రాలకు అవకాశం ఉండదు. సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లతో పోలిస్తే.. ఇవి సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చెప్పవచ్చు. వీటిపై వడ్డీ రేట్లు కూడా సాధారణ ఎఫ్డీల కంటేకాస్త ఎక్కువగా ఉంటాయి. రెండు సంవత్సరాల కాల పరిమితి గల FD ల కోసం ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు  వడ్డీరేట్లను పెంచాయి. 

యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రెండేళ్ల ఎఫ్ డీలపై ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 

బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండేళ్ల FD లపై 7.25 శాతం వరకు వడ్డీరేట్లను అందిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఈ బ్యాంక్ ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టిన రూ. లక్ష మొత్తం రెండేళ్లలో రూ. 1.15 లక్షలకు పెరుగుతుంది. 

యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ రెండేళ్ల FD లపై 7.10 శాతం వరకు వడ్డీరేట్లను అందిస్తుంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఈ బ్యాంకు ఉత్తమ వడ్డీరేట్లను అందిస్తుంది. ఇందులో పెట్టుబడిన పెట్టిన రూ. 1లక్ష మొత్తం రెండేళ్లలో రూ. 1.15 లక్షలకు పెరుగుతుంది. 

HDFC బ్యాంకు స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు..రెండేళ్ల FD లపై 7 శాతం వరకు వడ్డీరేట్లను అందిస్తున్నాయి. వీటిలో కూడా లక్ష పెట్టుబడి పెడితే రెండేళ్లలో రూ.1.15 లక్షలకు పెరుగుతుంది. 

కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా రెండేళ్ల FD లపై 6.35 శాతం వరకు వడ్డీరేట్లను అందిస్తున్నాయి. వీటిలో లక్ష పెట్టుబడి పెడితే రెండేళ్లలో రూ. 1.15 లక్షలకు పెరుగుతుంది. 

పంజాబ్ నేషనల్ బ్ాయంక్ రెండేళ్ల FD లపై 6.80 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తుంది. ఇక్కడ పెట్టుబడి రూ. లక్ష మొత్తం రెండేళ్లలో రూ 1.14 లక్షలకు పెరుగుతుంది. 

ఇండియాన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  రెండేళ్ల FDలపై 6.50 శాతం వరకు వడ్డీరేట్లను అందిస్తున్నాయి. వీటిలో లక్ష పెట్టుబడి పెడితే రెండేళ్లలో రూ. 1.14 లక్షలకు పెరుగుతుంది.