Good Food : ఇవి మీ ఆరోగ్యాన్ని పెంచుతాయి

Good Food : ఇవి మీ ఆరోగ్యాన్ని పెంచుతాయి

సీజన్ మారినప్పుడు ఆహారపు అలవాట్లు, తిండి కూడా మారాలి. ఆయా సీజన్లలో వచ్చే అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు, ఇమ్యూనిటీ పెంచుకునేందుకు తిండిలో మార్పులు చాలా అవసరం. బ్యాలెన్స్ డ్ డైట్ తింటే సీజనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు.

అంతేకాదు గుండె సమస్యలు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి క్రానిక్ డిసీజ్ లు రాకుండా జాగ్రత్తపడొచ్చు అంటోంది క్లినికల్ డైటీషియన్ శ్వేతా మహదిక్. ఆమె చెబుతున్న డైట్ ఇది... 

• మెటబాలిజం సరిగా జరగాలంటే ప్రొటీన్ కావాలి. పాలు, పప్పులు, సోయాబీన్స్, గుడ్డు తెల్లసొన, చికెన్తో పాటు చేపలు రెగ్యులర్గా తింటే శరీరానికి కావాల్సినంత ప్రొటీన్ దొరుకుతుంది.

• చలికాలంలో ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. పండ్లు, ఆకుకూరలు, ఓట్స్, బ్రౌన్ రైస్, సజ్జలు, జొన్నలు వంటివి డైట్ ఉండాలి. 

• ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆయిలీ ఫిష్ సాల్మన్ చేపలు, వాల్ నట్స్, బాదం, అవిసె గింజలు తినాలి. దాంతో వంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

• శరీరానికి అవసరమైన పోషకాల్లో ఫ్యాట్ ఒకటి. అయితే, శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉండే కేకులు, పేస్ట్రీలు, ప్రాసెస్డ్ మీట్ వంటివి తినొద్దు. అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉండే పీనట్ బటర్, అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటివి ఆరోగ్యాన్ని పెంచుతాయి. 

• వేగించినఫుడ్ బదులు... ఉడికించిన, ఆవిరి మీద వండినవి తింటే మంచిది.