అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందుకున్నది వీళ్లే

అయోధ్య  రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందుకున్నది వీళ్లే

కొన్నేళ్లుగా హిందువులు ఎంతోగానో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానాకి అంతా సిద్ధమైంది. జనవరి 22వ తేదీన అత్యంత వైభవోపేతంగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ప్రధాన మోదీ చేతుల మీదుగా జరిగే ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి  చాలా మంది హాజరు కానున్నారు. ఇప్పటికే ఆహ్వానాలు అందుకున్న సినీరాజకీయ ప్రమఖులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు.  

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందుకున్న రాజకీయ ప్రముఖుల విషయానికి వస్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా,  ఎల్ కే అద్వానీ,  మురళీమనోహర్ జోషి, యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కుటుంబం, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కుటుంబం,  లోక్ సభ మాజీ స్పీకర్లు సుమిత్ర మహజన్ లకు ఆహ్వానాలు అందాయి. 

ఇక  సినీ ప్రముఖుల విషయానికి వస్తే..  అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అక్షయ్‌కుమార్‌, అనుపమ్‌ఖేర్‌, అజయ్‌ దేవగణ్‌, కంగనా రనౌత్‌, మాధురీ దీక్షిత్‌, హేమామాలినిలకు ఆహ్వానాలు అందాయి.   క్రీడా ప్రముఖల్లో సచిన్‌ , కపిల్‌దేవ్‌, ధోని, సునీల్‌ గావస్కర్‌,  కోహ్లి, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, వీరేంద్ర సెహవాగ్‌, రవీంద్ర జడేజా, రోహిత్‌శర్మ, మిథాలీ రాజ్‌ అహ్వానాలు అందుకున్న వారిలో ప్రముఖంగా ఉన్నారు.