
పాలు కాచేటప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా...వరదలా పొంగి కిచెన్ అంతా పారతాయి. ఈ సమస్య ఎదురవ్వకూడదంటే పాలు కాచేటప్పుడు ఈ చిన్నచిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. పాలు కాచే గిన్నె మీద చెక్క లేదా స్టీల్ అట్లకాడ, చెంచా పెడితే పాల పొంగు ఆగుతుంది. అయితే అట్లకాడ రెండు అంచులకి సరిపోయే పొడవు ఉండాలి. పాలు వేడిచేసేముందు గిన్నె అడుగున చిన్న స్టీల్ ప్లేట్ వేసినా ఫలితం ఉంటుంది. పాలు పొంగు వచ్చేటప్పుడు కొన్ని చన్నీళ్లు చిలకరించినా పొంగు ఆగిపోతుంది. గిన్నె అంచున కొంచెం నెయ్యి రాసి పాలు మరిగిస్తే పొంగవు. నెయ్యిలోని గ్రీజ్ లాంటి పదార్థం పాలని పొంగనివ్వకుండా చూస్తుంది. ఒకవేళ పొంగినా గిన్నెకి మరకలు కావు. పాలు కాచే ముందు గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి, పాలు కలిపి వేడిచేస్తే అడుగు మాడదు.