ఈ కంపెనీల రిజల్ట్స్..ఓకే

ఈ కంపెనీల రిజల్ట్స్..ఓకే

 న్యూఢిల్లీ: ఐఓసీ, టాటా స్టీల్‌, టీవీఎస్‌‌, బజాజ్ ఆటో, కెనరా బ్యాంక్‌‌ వంటి  పెద్ద కంపెనీలు బుధవారం తమ డిసెంబర్ క్వార్టర్  (క్యూ3) రిజల్ట్స్ ప్రకటించాయి. వివిధ కంపెనీల ఫలితాలు ఇలా ఉన్నాయి.

1) ఐఓసీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కి క్యూ3 లో రూ.  8,063.39 కోట్ల నికర లాభం (స్టాండ్‌‌ఎలోన్) వచ్చింది. అంతకు ముందు ఏడాదిలోని డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ. 448.01 కోట్లతో పోలిస్తే కంపెనీ ప్రాఫిట్ భారీగా పెరిగింది. కానీ, కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ. 12,967.32 కోట్లతో పోలిస్తే మాత్రం తగ్గింది.  ఐఓసీ రెవెన్యూ క్యూ3 లో రూ.2.23 లక్షల కోట్లకు తగ్గింది. 2022–23 క్యూ3 లో రూ.2.28 లక్షల కోట్ల రెవెన్యూని కంపెనీ ప్రకటించింది. 
2) టెక్ మహీంద్రా : టెక్ మహీంద్రా నికర లాభం క్యూ3 లో 60 శాతం (ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌) పడింది. 2022–23 లోని క్యూ3 లో రూ.1,296 కోట్ల ప్రాఫిట్ సాధించిన కంపెనీ, తాజా క్యూ3 లో కేవలం రూ.510.4 కోట్ల ప్రాఫిట్ మాత్రమే ప్రకటించింది.  సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో కంపెనీ నికర లాభం రూ.493.9 కోట్లుగా ఉంది. రెవెన్యూ రూ.13,734 కోట్ల నుంచి రూ.13,101 కోట్లకు తగ్గింది. 
3) కెనరా బ్యాంక్‌‌ : కెనరా బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 29 శాతం పెరిగి క్యూ3 లో రూ. 3,656 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో బ్యాంక్ నికర లాభం రూ.2,832 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ. 26,218 కోట్ల నుంచి రూ.32,334 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 9.5 శాతం పెరిగి రూ.9,417 కోట్లకు చేరుకుంది. 
4) టాటా స్టీల్‌: టాటా స్టీల్‌‌కు డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ. 522.14 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌) వచ్చింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ.2,501.95 కోట్ల లాస్‌‌ ప్రకటించింది.

మరికొన్ని కంపెనీల రిజల్ట్స్‌‌..

  •  టీవీఎస్ మోటార్‌‌‌‌కు క్యూ3 లో రూ.479 కోట్ల నికర లాభం  (కన్సాలిడేటెడ్‌‌) వచ్చింది. కంపెనీ ప్రాఫిట్ ఏడాది ప్రాతిపదికన రూ.301 కోట్ల నుంచి 59 శాతం పెరిగింది.
  •  కర్నాటక బ్యాంక్‌‌ క్యూ3లో ఆల్‌‌ టైమ్‌‌ హైకి చేరుకుంది. బ్యాంక్‌కి 2022–23 క్యూ3 లో రూ. 826.49 కోట్ల నికర లాభం రాగా, తాజా క్యూ3 లో రూ.1,032.04 కోట్ల లాభం వచ్చింది. 
  •  యూకో బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 23 శాతం తగ్గి క్యూ3 లో రూ.503 కోట్లుగా రికార్డయ్యింది. అంతకు ముందు ఏడాది క్యూ3 లో రూ.65‌‌‌‌3 కోట్ల లాభాన్ని ప్రకటించింది. 
  •  బజాజ్ ఆటో రెవెన్యూ క్యూ3లో రూ.9,318.54 కోట్ల నుంచి రూ. 12,165.33 కోట్లకు (ఇయర్ ఆన్ ఇయర్‌‌) పెరిగింది. నికర లాభం 38 శాతం పెరిగి 1,472.7 కోట్ల నుంచి రూ.2,032.62 కోట్లకు చేరుకుంది.