వడ్డీ కట్టలేదని ఇంటికి పిలిచి చితకబాదిండు

వడ్డీ కట్టలేదని ఇంటికి పిలిచి చితకబాదిండు

 వికారాబాద్, వెలుగు: తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించలేదని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టిన ఘటన తాండూరులో జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరులోని రాజీవ్ కాలనీకి చెందిన బాలయ్య అనే ఆటో డ్రైవర్ గాంధీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మ్యాదరి రవి వద్ద మూడు నెలల కింద రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. నెలకు రూ.500ల చొప్పున మూడు నెలలకు వడ్డీ రూ.1500 అయింది. 

అసలుతోపాటు, వడ్డీ కూడా చెల్లించలేదని శుక్రవారం రవి బాలయ్యను ఇంటికి పిలిపించుకుని చితకబాదాడు. బాలయ్యను కొడుతూ ఫోన్​లో వీడియో తీయించాడు. అది కాస్తా సోషల్​మీడియాలో వైరల్​అయింది. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ సంతోశ్​కుమార్ తెలిపారు.