లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి మోసం చేసినవ్‌‌‌‌: వివేక్‌‌‌‌

లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి మోసం చేసినవ్‌‌‌‌: వివేక్‌‌‌‌

సంజయ్ పాదయాత్ర వల్లే ఫాం హౌస్‌‌‌‌ నుంచి సీఎం బయటకొచ్చిండు
గారడీ మాటలతో జనాన్ని మళ్లీ మోసం చేస్తుండని ఫైర్‌‌‌‌‌‌‌‌

ఖానాపూర్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మోసం చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. తన ఫామ్ హౌస్‌‌‌‌కు నీళ్లు మళ్లించుకునేందుకు ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం కట్టారని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా బుధవారం సంజయ్ శిబిరం వద్ద, తర్వాత ఖానాపూర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన బహిరంగ సభలో వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌లో వణుకు మొదలైందని, అందుకే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి జనంలో తిరుగుతున్నారని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ, మునుగోడు ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో తన గ్రాఫ్ పడిపోతుందన్న సంగతి కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు అర్థమైందన్నారు. దీంతో మరోసారి బయటకు వచ్చి గారడీ మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, కానీ జనం కేసీఆర్ మాటలను, వాగ్దానాలను నమ్మడం లేదన్నారు. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఖేల్‌‌‌‌ ఖతం..

ఫామ్ హౌస్‌‌‌‌లో నిద్రకు అలవాటు పడ్డ సీఎం కేసీఆర్.. ఖేల్ వచ్చే ఎన్నికల్లో ఖతమవ్వడం ఖాయమని వివేక్‌‌‌‌ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు గానీ, కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రం పదవుల పంట పండిందని చెప్పారు. సీఎం కొడుకు కేటీఆర్ తన సొంత చెల్లెలిని గెలిపించుకోలేని అసమర్థుడన్నారు. కేటీఆర్ ఎక్కడ బాధ్యతలు తీసుకుంటే అక్కడ టీఆర్ఎస్‌‌‌‌కు ఓటమి తప్పదన్నారు. ప్రజల సమస్యలను కేసీఆర్ గాలికి వదిలేసినందునే ఆ సమస్యలు తెలుసుకునేందుకు సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పేరు కల్వకుంట్ల కమిషన్ రావులా మారిందన్నారు. ఆయన ఇప్పటివరకు దోచుకున్నదంతా బయటకు తీయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలీసులు.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు సహకరిస్తూ బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, కానీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి బీజేపీ కార్యకర్త సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గద్దెదించే వరకు విశ్రమించొద్దని పిలుపునిచ్చారు.