అడ్డొస్తున్నాయని అడ్డంగా నరికేశారు

అడ్డొస్తున్నాయని అడ్డంగా నరికేశారు

కమర్షియల్​ బిల్డింగ్స్​ పనులకు అడ్డొస్తున్నాయని హరితహారం చెట్లను అడ్డంగా నరికేశారు. మచ్చబొల్లారంలోని లక్ష్మీఎన్​క్లేవ్​ సిమ్మింగ్ పూల్​కు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా గతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హరితహారం కింద మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. అయితే రాకపోకలకు, నిర్మాణ పనులకు అడ్డొస్తున్నాయని స్థానిక బిల్డర్లు, కమర్షియల్​బిల్డింగ్స్ యజమానులు ఇటీవల దాదాపు 20 చెట్లను నరికేశారు. 

కొన్నింటి కొమ్మలు కొట్టగా, మరికొన్నింటిని సగానికి నరికేశారు. అధిక మొత్తంలో చెట్లను నరికేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.