టెంపరరీ జాబ్స్​లో వీరికే ఎక్కువ చాన్సులు

టెంపరరీ జాబ్స్​లో వీరికే ఎక్కువ చాన్సులు
  •     ఈ‑కామర్స్​కంపెనీల నుంచి భారీగా అవకాశాలు
  •     ఇప్పటికీ కొన్ని జాబ్స్​లో పురుషులదే ఆధిపత్యం

న్యూఢిల్లీ: ఉద్యోగుల్లో పురుషులతో పాటు మహిళల సంఖ్య సమానంగా ఉండాలని ఇండియాలోని చాలా కంపెనీలు కోరుకుంటున్నాయి. లింగ వైవిధ్యం ఇంపార్టెన్స్​ గురించి అంతటా అవగాహన పెరుగుతుండటంతో ఉద్యోగాల్లో తగినంత వాటా మహిళలకు దక్కుతోంది. ఈ పండుగ -సీజన్ కోసం ఇస్తున్న టెంపరరీ జాబ్స్​లో ఆడవాళ్లకు తగినన్ని ఉద్యోగాలను ఇస్తున్నాయి. ఈ విషయంలో ఈ–కామర్స్ కంపెనీలు (ఆన్​లైన్​ షాపింగ్​ ప్లాట్​ఫారాలు)  ముందున్నాయి. ఈ నెల మొదలుకొని సంవత్సరం ఆఖరు వరకు ఫెస్టివల్స్​ సేల్స్​ జరుగుతూనే ఉంటాయి. అన్ని రకాల వస్తువులు విపరీతంగా అమ్ముడవుతాయి.  అందుకే పండుగ సీజన్‌‌లో తాత్కాలిక కార్మికులకు  డిమాండ్‌‌ బాగుంటుందని రాండ్‌‌స్టాడ్, సిఐఇఎల్ హెచ్‌‌ఆర్ సర్వీసెస్, క్వెస్  టీమ్‌‌లీజ్ సర్వీసెస్‌‌తో సహా ప్రముఖ రిక్రూరెంట్​ ఏజెన్సీలు  తెలిపాయి. "కాంట్రాక్ట్ జాబ్స్​లో మహిళల సంఖ్య ప్రస్తుతం చాలా మెరుగ్గా ఉంది. పురుషుల సంఖ్యతో ఇప్పటికీ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ గతంలో పోలిస్తే ఎంతగానో పెరిగింది" అని సీఐఈఎల్​ హెచ్​ఆర్​ సర్వీసెస్ సీఈఓ ఆదిత్య నారాయణ్ మిశ్రా అన్నారు. కంపెనీలు వేర్‌‌హౌస్  సప్లయ్ చైన్‌‌లో వివిధ జాబ్స్​కు మహిళలను నియమించుకుంటున్నాయి.    

ఒకప్పుడు మగవాళ్లు.. ఇప్పుడు ఆడవాళ్లు కూడా..

కొంతకాలం వరకు పురుషులకు మాత్రమే అందుబాటులో ఉండే అనేక వేర్‌‌హౌస్ జాబ్స్.. అంటే పికింగ్, ప్యాకింగ్, లోడ్ చేయడం, అన్‌‌లోడ్ చేయడం,  లాజిస్టిక్స్ పనులు ఇప్పుడు ఆడవాళ్లూ చేస్తున్నారు.  ఎక్కువ మంది మహిళా తాత్కాలిక కార్మికులను  తీసుకుంటున్న వాటిలో మింత్రా, ఫ్లిప్‌‌కార్ట్, అమెజాన్,  స్విగ్గీ ఉన్నాయని స్టాఫింగ్ కంపెనీలు తెలిపాయి. ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తున్న ఫ్లిప్‌‌కార్ట్, సప్లై చైన్ ఉద్యోగులలో మహిళల సంఖ్యను ఐదు వేల నుంచి 10వేలకి పెంచాయి. మింత్రా 2,500లకుపైగా మహిళలను నియమించుకుంది. - గత సంవత్సరం కంటే తాత్కాలిక నియామకాలు 66% పెరిగాయి.- విమెన్​ రిక్రూట్​మెంట్​కు సంబంధించిన పంపిన  ప్రశ్నలకు స్విగ్గీ, అమెజాన్​ స్పందించలేదు.

ఈ రంగాల్లో మహిళలు ఎక్కువ..

కస్టమర్ సర్వీస్, లాజిస్టిక్స్, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌‌మెంట్, ఈ–-కామర్స్, వేర్‌‌హౌసింగ్  హబ్‌‌లలో సార్టింగ్ & ప్యాకింగ్‌‌లకు సంబంధించిన తాత్కాలిక జాబ్స్​లో మహిళలకు డిమాండ్ పెరిగినట్లు   రాండ్‌‌స్టాడ్ టెక్నాలజీస్ స్టాఫింగ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ యేషాబ్ గిరి తెలిపారు. అంతేగాక లాజిస్టిక్స్ & సప్లై చైన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఈ–-కామర్స్, కన్జూమర్ టెక్నాలజీ వంటి కొన్ని రంగాలు తాత్కాలిక జాబ్స్​కు మహిళలను నియమించుకుంటున్నాయని గిరి తెలిపారు. మహిళలకు డిమాండ్ ప్రధానంగా ఈ–కామర్స్ కంపెనీల నుంచి​ ఉందని టీమ్‌‌లీజ్ కో–ఫౌండర్​ రీతుపర్ణ చక్రవర్తి అన్నారు. వేర్‌‌హౌస్,  షాప్-ఫ్లోర్ కార్యకలాపాలు,  టైలరింగ్ వంటి జాబ్స్​లో మహిళలు ఎక్కువగా కనిపిస్తారని ఆమె అన్నారు. అయితే మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు లేవని స్టాఫింగ్ సంస్థలు తెలిపాయి.   కొన్ని సందర్భాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు ప్రయాణ సౌకర్యాలను అందిస్తున్నాయి. కొన్నింటిలో ఇలాంటి సదుపాయాలు కూడా ఉండటం లేదు. కస్టమర్లతో నేరుగా మాట్లాడే జాబ్స్​లో మహిళలను నియమించడానికి కంపెనీలు  ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని క్వెస్ వర్క్‌‌ఫోర్స్ మేనేజ్‌‌మెంట్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా అన్నారు..