
- సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు
- అసెంబ్లీ ముట్టడికి యత్నం.. అరెస్ట్
బషీర్ బాగ్, -వెలుగు: తమను పర్మినెంట్చేయాలని డిమాండ్చేస్తూ రాష్ట్రంలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బషీర్ బాగ్ లోని సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నేతలు సురేందర్, యాదగిరి, సౌజన్య, దుర్గం శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమను పర్మినెంట్చేయాలని కోరారు.
అప్పటివరకు మినిమం టైమ్ స్కేల్అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18 ఏండ్లుగా కాంట్రాక్ట్ఉద్యోగులుగా కొనసాగుతున్నామని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. పాఠశాల విద్య అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలని వేడుకున్నారు. జీవిత బీమా కింద రూ.10 లక్షలు , ఆరోగ్య బీమా కింద రూ.5లక్షలు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ లో భాగంగా రూ. 20 లక్షలు చెల్లించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.