
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ని టెక్ కంపెనీలే కాదు.. రాజకీయ నాయకులూ వాడుకుంటున్నారు. బ్రిటన్‌కి చెందిన ఎంపీ మార్క్ సెవార్డ్స్ తనలాగే ఉండే ఏఐ బాట్‌ని తయారు చేయించాడు. వర్చువల్ రియాలిటీతో పనిచేసే ఈ బాట్ ద్వారా తన నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వీలు కలుగుతోందని ఆయన చెప్తున్నాడు.
సమస్యల్లో ఉన్న ప్రజలకు సంవత్సరంలో 365 రోజులు, 24 గంటలు ఈ బాట్ అందుబాటులో ఉంటుంది. ఇది అచ్చం మార్క్‌లాగే ఉంటుంది. అతని వాయిస్‌తోనే మాట్లాడుతుంది. ప్రజలకు అవసరమైన సలహాలు, సపోర్ట్ అందిస్తుంది. దీన్ని తయారుచేయించడానికి ఏఐ స్టార్టప్ సంస్థ ‘న్యూరల్ వాయిస్’ సాయం తీసుకున్నాడు మార్క్.
►ALSO READ | ప్రకృతికి మనిషి చేస్తున్న ద్రోహం.. మనిషితో పాటు పక్షులకూ నిద్ర కరువు!
ప్రస్తుతం అందుబాటులో ఉన్నది ప్రోటోటైప్ మాత్రమే. దీన్ని త్వరలోనే మరింత కస్టమైజ్ చేసి తీసుకురానున్నారు. తన ఏఐ వెర్షన్ ప్రజలు చెప్పిన అన్ని విషయాలను రికార్డు చేసి.. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తుందని.. తన సమాధానాలు వారికి చేరుస్తుందని మార్క్ అంటున్నాడు.