ప్రకృతికి మనిషి చేస్తున్న ద్రోహం.. మనిషితో పాటు పక్షులకూ నిద్ర కరువు!

ప్రకృతికి మనిషి చేస్తున్న ద్రోహం.. మనిషితో పాటు పక్షులకూ నిద్ర కరువు!

ఏ కారణం వల్లైనా ఒకరోజు రాత్రి కంటి నిండా నిద్రలేకపోతే.. మరుసటి రోజు అలసటగా అనిపిస్తుంటుంది. కొన్నాళ్లపాటు ఇదే జరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అచ్చం మనలాగే అన్ని జంతువులకు నిద్ర అవసరమని సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చెప్తున్నారు. జెల్లీ ఫిష్ నుంచి పురుగులు, తిమింగలాలు, పక్షుల వరకు అన్నింటికీ కంటి నిండా నిద్ర కావాల్సిందే. అంతెందుకు కొన్ని జంతువులు తమ జీవితంలో ఎక్కువ భాగం నిద్రలోనే గడుపుతాయి. గబ్బిలాలు లాంటివి రోజుకు 20 గంటల వరకు నిద్రపోతాయి. కానీ.. పెరిగిన కాలుష్యం, పట్టణీకరణ వల్ల వాటికి నిద్ర కరువు అవుతోందని స్టడీలు చెప్తున్నాయి. ముఖ్యంగా పక్షులకు  సరిపడా నిద్రలేకపోతే ఎన్నో సమస్యలు ఎదురవుతాయట. ఈ మధ్య వచ్చిన ఒక స్టడీ ప్రకారం.. నిద్ర లేకపోతే పక్షి కూత(అరుపు)లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని తేలింది. 

సాధారణంగా పక్షులు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ఆహారం దొరికినప్పుడు, అవి ఎక్కడున్నాయో తెలిపే సమాచారాన్ని తోటి పక్షులకు చేరవేయడానికి అరుస్తుంటాయి. అయితే.. పక్షులు సరిగ్గా అరవాలంటే మెదడులోని కొన్ని భాగాలు, ఊపిరితిత్తులు, గొంతు కండరాలతో సహా అనేక శరీర వ్యవస్థల మధ్య సమన్వయం అవసరం. ఆ సమన్వయం బాగుంటేనే స్పష్టంగా అరవగలుగుతాయి. సరైన సమాచారం చేరవేసి, తమ సహచరులను ఆకర్షిస్తాయి. అయితే.. పట్టణీకరణ వల్ల వాటి నిద్ర నాణ్యత దెబ్బతింటోంది. నిరంతరం విస్తరిస్తున్న నగరాలతో, రాత్రిపూట వెలుతురు, శబ్ద కాలుష్యం ఇలా ఎన్నో  అవాంతరాలు పక్షులకు సరైన నిద్రలేకుండా చేస్తున్నాయి. మనిషిలాగే వాటికి కూడా బ్రెయిన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జ్ఞాపకశక్తి, మోటివేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్ట్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తగ్గించుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. 

మైనాలపై చేసిన ఒక స్టడీలో బాగా నిద్రపోయినవి మరుసటి రోజు బాగా కూతలు కూశాయి. కానీ.. నిద్రలేక ఇబ్బంది పడినవి మాత్రం మరుసటి రోజు చాలా నీరసంగా ఉన్నాయి. వాటి అరుపుల నాణ్యత కూడా బాగా తగ్గింది. దాంతో తోటి పక్షులకు సమాచారాన్ని చేరవేయలేకపోయాయి. పైగా పగటి పూట ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకున్నాయి. ఆస్ట్రేలియన్ మాగ్పైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చేసిన స్టడీలో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. దీనివల్ల భవిష్యత్తులో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదమూ లేకపోలేదు అంటున్నారు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.