CMANTHAM: ఆసక్తిని పెంచేలా ‘సీమంతం’.. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇది భయ్యా..

CMANTHAM: ఆసక్తిని పెంచేలా ‘సీమంతం’.. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇది భయ్యా..

పెళ్లి తర్వాత  ఆడపిల్ల జీవితంలో ఘనంగా జరుపుకునే వేడుక  ‘సీమంతం’.ఈ టైటిల్‌‌‌‌తో దర్శకుడు సుధాకర్ పాణి సినిమాను రూపొందిస్తున్నాడు. టీఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ప్రశాంత్ టాటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వజ్రయోగి, శ్రేయ భర్తీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌‌‌‌మెంట్‌‌‌‌తో పాటు గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

ఎమోషనల్ డెప్త్‌‌‌‌తో ఉన్న వీడియో, బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరుతో స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచింది. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో ప్రెగ్నెంట్ మహిళ చేతులు వెనక్కి కట్టి ఉండటం సినిమాపై ఆసక్తిని పెంచాయి. గాయత్రీ సౌమ్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్. సుహాస్ సంగీతం అందిస్తున్నాడు.

సీమంతం వేడుక:

సీమంతం అనేది హిందూ సాంప్రదాయంలో ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలకు చేసే ఒక ముఖ్యమైన వేడుక. సాధారణంగా ఏడవ నెలలో లేదా 9వ నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్త్రీకి కొత్త బట్టలు పెట్టి, గాజులు తొడిగి ఇలా కుటుంబ సభ్యులు గ్రాండ్ గా చేస్తారు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ‘సీమంతం’లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

►ALSO READ | Filmfare: అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్.. వెంకీ, చిరు, బన్నీకి దక్కిన అవార్డ్స్ ఇవే..

ఒక చీకటి గది, అందులో ప్రెగ్నెంట్ మహిళ చేతులు వెనక్కి కట్టి ఉండటం, చేతులకి రక్తం, చుట్టూరా కత్తులు, ఒక పళ్లెంలో కుంకుమ, గాజులు, అక్షింతలు.. ఇలా ప్రతీదీ సస్పెన్స్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆసక్తి రేపే థ్రిల్లర్ అంటే ఇది భయ్యా.. అంటూ సినీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.