
ఫిల్మ్‌ఫేర్ గ్రామర్ & స్టైల్ అవార్డ్స్ సౌత్ - 2025 వేడుక అట్టహాసంగా జరిగింది. బంజారాహిల్స్ పార్కు హయత్ హోటల్‌లో శనివారం రాత్రి (ఆగస్టు 9న) గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో తెలుగు స్టార్స్ సత్తా చాటారు. దేవీశ్రీ ప్రసాద్, శిరీష్, మంచు లక్ష్మి, ప్రగ్యా జైశ్వాల్, సుధీర్, సందీప్‌కిషన్.. పుష్ప పాటకు డ్యాన్స్ చేసి జోష్ నింపారు.
ఈ అవార్డ్స్‌లో సౌత్ నుంచి మెగాస్టార్ చిరంజీవి.. స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్‌గా ఎంపికయ్యారు. విక్టరీ వెంకటేశ్‌కు స్టార్ ఆఫ్ ఆల్ సీజన్స్ అవార్డు దక్కింది. ఇక స్టైలిష్ అండ్ ఐకాన్ అవార్డ్.. స్టార్ హీరో అల్లు అర్జున్ దక్కించుకున్నారు. అంతేకాకుండా మిగతా విభాగాల్లో ఎవరెవరు.. ఏ అవార్డు దక్కించుకున్నారో ఫుల్ లిస్ట్ చూసేయండి.
Congratulations!
— Filmfare (@filmfare) August 9, 2025
The award for Man Of Style And Substance goes to #Nani at the #EugenixFilmfareGlamourAndStyleAwardsSouth2025@EugenixHair #FilmfareGlamourAndStyleAwardsSouth 2025#filmfareawards#filmfare pic.twitter.com/gQA0juxDnQ
విన్నర్స్ ఫుల్ లిస్ట్:
స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్: చిరంజీవి
స్టైలిష్ ఐకాన్&స్టార్: అల్లు అర్జున్
స్టార్ ఆఫ్ ఆల్ సీజన్స్: వెంకటేష్
మ్యాన్ ఆఫ్ స్టైల్ & సబ్‌స్టాన్స్: నాని
గ్లామరస్ యూత్ ఐకాన్: విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా
హాట్ స్టెప్పర్ ఆఫ్ ది ఇయర్: అడివి శేష్, మాళవిక మోహనన్
ఫ్యాషన్ ఫార్వర్డ్ స్టార్ (మేల్): సిద్ధార్థ్
ఉమెన్ ఆఫ్‌స్టైల్ అండ్ సబ్‌స్టాన్స్: అదితి రావుహైదరీ
ఫిట్ అండ్ ఫ్యాబులస్ (ఫిమేల్): ప్రగ్యా జైశ్వాల్
మోస్ట్ గ్లామరస్ స్టార్ (మేల్): సుధీర్ బాబు
రెడ్ కార్పెట్ లుక్ ఆఫ్ ది ఇయర్: సందీప్ కిషన్, భాగ్యశ్రీ బోర్సే
మోస్ట్ డిజైరబుల్ స్టార్ (మేల్): సాయి ధరమ్‌తేజ్
డేర్ టు బీ డిఫరెంట్: అల్లు శిరీష్
ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ఫ్యాషన్: తేజ సజ్జా, భాగ్యశ్రీ బోర్సే
మోస్ట్ ఫ్యాషనబుల్ స్టార్‌కపుల్: అదితి రావు హైదరీ, సిద్ధార్థ్
స్టైలిష్ డైరెక్టర్: అనిల్ రావిపూడి
స్టైలిష్ మూవీ మొఘల్: నాగవంశీ
అల్టిమేట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవీ శ్రీ ప్రసాద్
అల్టిమేట్ సింగర్ (ఫీమేల్): చిన్మయి శ్రీపాద
Here is the full list of winners of the #EugenixFilmfareGlamourAndStyleAwardsSouth2025.#FilmfareAwardshttps://t.co/ipk9UusNxv
— Filmfare (@filmfare) August 9, 2025