గల్లంతైన వ్యక్తి కోసం వెళ్లి చిక్కుకున్నారు..!

గల్లంతైన వ్యక్తి కోసం వెళ్లి చిక్కుకున్నారు..!

పాల్వంచ రూరల్, వెలుగు: భారీ వర్షాల వల్ల కిన్నెరసాని వాగులో గల్లంతైన వ్యక్తిని వెతికేందుకు వెళ్లి చిక్కుకుపోయిన ఐదుగురిని అధికారులు క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. బుధవారం భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం దంతెలబొర సోంపెల్లి గ్రామాల మధ్యలోని కిన్నెరసాని వాగులో కుంజా భద్రం, సోడెం వెంకటరత్నం, సోడెం జాని, సోయం వెంకటేశ్వర్లు, జారె సాయి, సర్ప లవకుమార్ గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురు క్షేమంగా బయటికి వచ్చారు. జారె సాయి రాకపోవడంతో అతని ఆచూకీ కోసం గురువారం మళ్లీ వెళ్లి వెతుకుతున్నారు.

 కొద్దిసేపటి తర్వాత కిన్నెరసాని రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో వరద ఉధృతి పెరగడంతో ఐదుగురు చిక్కుకుపోయారు. ఈ విషయం తెలియడంతో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్​జితేశ్​పాటిల్ పర్యవేక్షణలో కొత్తగూడెం ఆర్​డీఓ మధు, భద్రాచలం ఆర్డీఓ దామోదర్​రావు, స్థానిక తహసీల్దార్​వివేక్, విజయభాస్కర్​రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. వాగులో చిక్కుకున్న ఐదుగురికి డ్రోన్​ద్వారా ఆహార పొట్లాలను, సేఫ్టీ జాకెట్లను పంపించారు. ఎట్టకేలకు వారిని డీడీఆర్ఎఫ్​, ఎన్​డీఆర్ఎఫ్​టీమ్ లు బోటు ద్వారా క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.