దేవుడినీ వదల్లేదా : శివాలయంలో దొంగతనం.. హుండీలో డబ్బు దోపిడీ

దేవుడినీ వదల్లేదా : శివాలయంలో దొంగతనం.. హుండీలో డబ్బు దోపిడీ

ఓం నమ:శివాయా.. దొంగలు మరీ దుర్మార్గంగా ఉన్నారు.. గుడి లేదు గుడిలోని లింగం లేదు అన్న సామెతగా.. ఏకంగా శివాలయంలోనే దోపిడీకి పాల్పడ్డారు. శివుడి సాక్షిగా గుడిలోని మొత్తం సొమ్మును దోచుకెళ్లారు దొంగలు. శివాలయంలోని హుండీని పగలగొట్టి.. అందులోని డబ్బును తీసుకుని.. ఆ హుండీని బయటపడేసి వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..

సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలోని శివాలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలోని హుండీని పగలగొట్టి నగదు బంగారం ఎత్తుకెళ్లారు. ఆలయ తలుపులు పగలగొట్టి ఆభరణాలు అపహరించారు. దేవాలయం పక్కనే ఉన్న రెండు షాపులను సైతం కేటుగాళ్లు వదల్లేదు. వెళ్తూ.. వెళ్తూ వచ్చిన బండ్లో ఏం వేళ్లాంలే అనుకున్నారో ఏమో కానీ పక్కనే ఉన్న ఓ ఇంట్లో నుంచి ఓ బైక్ ను చోరీ  చేశారు.

 మంగళవారం తెల్లవారుజామున పూజారి వచ్చి చూసే సరికి ఆలయం మొత్తం గందరగోళంగా ఉండటంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న గ్రామాస్తులు పోలీసులకు ఫోన్ చేశారు. 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.