కృష్ణ ఇంటి వద్ద జేబు దొంగల చేతివాటం

కృష్ణ ఇంటి వద్ద జేబు దొంగల చేతివాటం

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ ఇంటి దగ్గర జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. కృష్ణ భౌతిక కాయాన్ని  చూడటానికి వచ్చిన అభిమానుల  దగ్గర నుండి దొంగలు డబ్బులు కొట్టేశారు. కడసారి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో కృష్ణ ఇంటికి వస్తుండడంతో ఆ మార్గంలో రద్దీ ఏర్పడింది. దీంతో ఇదే అదనుగా చేసుకుని జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. తమ అభిమాన హీరోని కడసారి చూద్దాం అనుకుని వచ్చిన అభిమానుల్లో కొందరు దొంగల బారిన పడి డబ్బులు పోగొట్టుకుని లబో దిబోమన్నారు. 

కొందరు బాధితులు జేబు దొంగలుగా అనుమానించి నిలదీశారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరగ్గా.. ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు పెద్ద ఎత్తున హారన్ మోగిస్తూ.. క్లియర్ చేయమని ఒత్తిడి చేయడంతో వాగ్వాదం జరిగే చోట ఏం జరిగిందో..  ఎవరు ఏం మాట్లాడుతున్నారో.. అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. డబ్బులు, పర్సులు, మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు ఆందోళనకు గురికాగా.. దొంగలు అదను చూసి మెల్లగా జారుకున్నారు.