
కర్నాటక సంపర్క్ క్రాంతి రైలులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తోటి ప్రయాణీకులుగా నమ్మించి అనంతపురం జిల్లా ధర్మవరంలో రైలు ఎక్కిన దుండగులు… కూల్ డ్రింక్, బిస్కెట్లలో మత్తు పదార్దాలు కలిపి ఇచ్చారు. దీంతో ఆరుగురు ప్రయాణీకులు స్పృహ కోల్పోయారు. దీంతో వారి నుంచి డబ్బులు, బంగారం, సెల్ ఫోన్లు చోరీ చేసి వెళ్లిపోయారు. బాధితులు 12 గంటల పాటు మత్తులోనే ఉండిపోయారు. సాయంత్రం కాజీపేటలో వీరిని గుర్తించి ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. ఇందులో నలుగురు కోలుకోగా… మరో ఇద్దరు రాత్రి వరకు కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నారు.
బెంగళూరు నుంచి బయల్దేరిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ బోగీలో కొందరు కూర్చొని మాటలు కలిపి ప్రయాణీకులకు బిస్కట్లు, కూల్ డ్రింక్ లు ఇచ్చారు. వీటిని తీసుకున్న కర్ణాటకకు చెందినర నితిన్ జైన్, బెంగళూరుకు చెందిన రాహుల్, బీహర్ కు చెందిన ప్రేమ్ శంకర్, యూపీకి చెందిన టింక్, సూర్యకాంత్, అబ్బాస్ ఖాన్ మత్తులోకి వెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వీరంతా ఇలానే ఉండడంతో…. తోటి ప్రయాణీకులు గమనించి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాజేపేట పోలీసులు వీరిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు.