
మాక్లూర్, వెలుగు: మాక్లూర్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మగుడిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడినట్లు కమిటీ సభ్యులు చెప్పారు. ఎల్లమ్మ గుడిలో ఇటీవల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన సీపీయూతో పాటు ఆరు గ్రాముల బంగారు నగలు, మూడు జతల కండ్ల సెట్స్, హుండీలో ఉన్న సుమారు 10వేల నగదు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.