మక్తల్లో 66 తులాల బంగారం చోరీ

మక్తల్లో 66 తులాల బంగారం చోరీ

మక్తల్, వెలుగు : మక్తల్​ పట్టణంలో ఆదివారం రాత్రి ఇంటి తలువులు పగలగొట్టి 66 తులాల బంగారం, రూ.50 వేలు ఎత్తుకెళ్లినట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. పట్టణంలోని సంగంబండ రోడ్​లో ఉన్న ద్వారకానగర్‌లో ఉంటున్న చిగుళ్లపల్లి రాఘవేందర్  ఇంట్లో కిచెన్​ తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలో దాచుకున్న బంగారం, నగదును ఎత్తుకెళ్లారు.

విషయం తెలుసుకున్న సీఐ, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.