సికింద్రాబాద్​లోని అన్ని ఏరియాలను డెవలప్ చేశాం : పద్మారావు గౌడ్

సికింద్రాబాద్​లోని అన్ని ఏరియాలను డెవలప్ చేశాం :  పద్మారావు గౌడ్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ సెగ్మెంట్​లో కాలనీలు, బస్తీలనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో సమానంగా అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. గురువారం బౌద్దనగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా  అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామన్నారు. 

ALSO READ: పొల్యూషన్ కంట్రోల్ పై స్పెషల్ టాస్క్ ఫోర్స్

పదేళ్లుగా  మౌలిక వసతుల ఏర్పాటపై ఫోకస్ పెట్టామన్నారు. అనంతరం లలితానగర్, బ్యాంక్ కాలనీ, అంబర్ నగర్, రాఘవేంద్రనగర్ కాలనీల్లో పద్మారావు గౌడ్ పాదయాత్ర సాగింది. మహిళలు మంగళహారతులు పట్టి ఆయనకు ఘన స్వాగతం పలికారు.  ఆయన వెంట డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు రాసురి సునీత, ప్రసన్న ఉన్నారు.