సైమండ్స్​తో బ్రిటన్ ప్రధాని ప్రేమాయణం..

సైమండ్స్​తో బ్రిటన్ ప్రధాని ప్రేమాయణం..

లండన్నంబర్ 10 డౌనింగ్ స్ర్టీట్.. బ్రిటన్ ప్రధాని  అధికారిక నివాసం. పదవీ కాలం ముగిసే వరకు పీఎం అక్కడే ఉంటారు. కొత్తగా ప్రధాని అయిన వారెవరైనా తొలిసారిగా అందులోకి వెళ్లేముందు భార్య/భర్త పిల్లలను వెంట తీసుకెళ్తారు. ఫొటోలకు ఫోజులిస్తారు. ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమిది. థెరెసా మే స్థానంలో పీఎంగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ మాత్రం ఒక్కరే వెళ్లారు. వెంట భార్య లేరు, పిల్లలు కూడా లేరు. బయట మాత్రం గర్ల్​ఫ్రెండ్ నిలబడ్డారు. భార్య ఉన్నప్పటికీ అలా ఒక్కరే వెళ్లి కొత్త ట్రెండ్ సృష్టించారు జాన్సన్. త్వరలో గర్ల్​ఫ్రెండ్​ను తీసుకెళ్తారని సమాచారం. ఇలా కూడా ఆయన రికార్డు సృష్టించనున్నారు.

విడాకులు అక్కడ కామన్

55 ఏళ్ల జాన్సన్​కు భార్య మెరీనా వీలర్, నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే తామిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు గత సెప్టెంబర్​లో వారు ప్రకటించారు. 25 ఏళ్లపాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించిన వీరు.. ప్రస్తుతం వేరుగా ఉంటున్నా, ఇంకా సాంకేతికంగా విడాకులు తీసుకోలేదు. ఇంగ్లండ్, వేల్స్ దేశాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. 25 ఏళ్లు కలిసి బతకడం అంటే చాలా ఎక్కువ. మన దగ్గర చాలా తక్కువ మంది విడాకులు తీసుకుంటారు. కానీ.. అక్కడ 100 పెళ్లిళ్లు జరిగితే అందులో 64 పెటాకులవుతున్నాయి. విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.

పొలిటికల్.. పర్సనల్!!

కన్జర్వేటివ్ పార్టీలో తనతో కలిసి పని చేసే 31 ఏళ్ల కేరీ సైమండ్స్​తో జాన్సన్ ప్రేమయాణం సాగిస్తున్నారు. థియేటర్ స్టడీస్, హిస్టరీ ఆఫ్ ఆర్ట్​లో ఫస్ట్​క్లాస్ డిగ్రీ తీసుకున్న సైమండ్స్.. 2010 నుంచి కన్జర్వేటివ్ పార్టీతో కలిసి పని చేస్తున్నారు. అటు పొలిటికల్ పార్ట్​నర్​గా ఇటు పర్సనల్ పార్ట్​నర్​గా ఆమె కొనసాగుతున్నారని ఆరోపణలున్నాయి. 2012లో లండన్​మేయర్​గా జాన్సన్ మరోసారి ఎన్నికవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించారు. తర్వాత కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్​గా పని చేశారు. నంబర్ 10 డౌనింగ్ స్ర్టీట్​లోకి సైమండ్స్​తోనే కలిసి జాన్సన్ వెళ్లాల్సింది. కానీ ఎందుకో అలా చేయలేదు. త్వరలోనే ఆమెను తీసుకెళ్తారని సమాచారం.

వ్యక్తిగత జీవితం వ్యక్తిగతమే..

చిందరవందరగా ఉన్న జుట్టుతో నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తారు బోరిస్ జాన్సన్. అయితే తన తెలివి, మాటలతో ఎలాంటి క్రైసిస్​అయినా పరిష్కరిస్తారని పేరు. ఈయన వల్ల ఎందరో రాజకీయ జీవితాలు మధ్యలోనే ముగిసిపోయాయనే ఆరోపణలున్నాయి. బ్రిటన్ నాయకత్వం విషయానికి వస్తే జాన్సన్ పెళ్లి ప్రస్తావన పెద్ద అడ్డు కాబోదని అక్కడి నేతలు చెబుతున్నారు.  ‘ట్రెడిషనల్’గా ఉండే కన్జర్వేటిక్ పార్టీ నేతలే ఆయన్ను ప్రధానిగా ఎన్నుకున్నారని గుర్తు చేస్తున్నారు.‘‘వ్యక్తిగత జీవితం వ్యక్తిగతమే. మనం ప్రస్తుతం ‘మోడ్రన్ ఏజ్’ లో ఉన్నాం. నిజానికి బోరిస్​కు కలర్​ఫుల్ ప్రైవేట్ లైఫ్ దొరికింది. గతంలో ఎందరో ప్రధానులు ఇలాంటి జీవితం ఎంజాయ్ చేశారు’’ అని పార్టీ మెంబర్ అంగస్ వెస్ట్ చెప్పారు. 2004లో స్పెక్టేటర్ మేగజైన్ ఎడిటర్​గా ఉన్న బోరిస్.. తన సహ ఉద్యోగితో ఎఫైర్ కొనసాగించారనే కారణంతో కన్జర్వేటివ్ పార్టీ స్పోక్స్​పర్సన్ పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు ప్రధాని పదవి దక్కించుకున్నారు