చెయ్యి విరిగిందని ఎంజీఎం వెళ్తే.. చిన్నారి ప్రాణం పోయింది

 చెయ్యి విరిగిందని ఎంజీఎం వెళ్తే.. చిన్నారి ప్రాణం పోయింది

చెయ్యి విరిగిందని ఓ పిల్లాడిని ఆస్పత్రికి తీసుకువెళ్తే  చివరికి అతని ప్రాణమే పోయింది. చెన్నారావుపేట సిద్దార్థ హైస్కూల్​లో 3వ తరగతి చదువుతున్న  భూక్య నిహాన్ ఈ నెల 4న స్కూల్​ ఆవరణలో జారుడుబండ ఆడుతూ కిందపడిపోయాడు. దీంతో అతని కుడి చేయి ప్రాక్చర్​ అయింది. స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్తే అక్కడ ఫస్ట్​ ఎయిడ్​ చేయించి పేరెంట్స్​కు అప్పజెప్పారు. అదే రోజు సాయింత్రం బాబును అతని పేరెంట్స్​ వరంగల్ లోని​ ఎంజీఎంలో అడ్మిట్​ చేశారు.

సోమవారం బాబును అబ్జర్వ్​లో ఉంచిన డాక్టర్లు... మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆపరేషన్​ థియేటర్​కు తీసుకెళ్లారు. గంట తర్వాత బాబు చనిపోయినట్లుగా పేరెంట్స్​కు చెప్పారు. అనస్థీషియా  డోస్ ఎక్కువ అవడం వల్లే బాబు చనిపోయినట్టు తెలుస్తోంది.  హాస్పిటల్,  డాక్టర్ల నిర్లక్ష్యంపై  కుటుంబ సభ్యులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెబుతున్నారు.