21 మందితో వైసీపీ మూడో జాబితా

21 మందితో వైసీపీ మూడో జాబితా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో  రెండో సారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో బలమైన ఇంఛార్జీలను నియమించే పనిలో పడ్డారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జీలను ప్రకటిస్తూ రెండు జాబితాలను విడుదల చేశారు. తాజాగా మూడో జాబితా గురువారం (జనవరి 11) విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 21 స్థానాల్లో కొత్త ఇంఛార్జీలను నియమించారు సీఎం జగన్. 

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన  మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సుదీర్ఘంగా చర్చించి మూడో జాబితాను  ఫైనల్ చేశారు. ఈ జాబితాలో పార్లమెంట్ పరిధిలోని పలువురికి ఇంఛార్జీలుగా అవకాశం కల్పించారు. 

లోక్ సభ స్థానాలకు ఇంఛార్జీలు వీరే 

  • శ్రీకాకుళం - పెరాడ తిలక్ 
  • విశాఖపట్నం -బోత్స ఝాన్సీ లక్ష్మీ 
  • ఏలూరు- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ 
  • విజయవాడ - కేశినేని నాని 
  • కర్నూలు - గుమ్మనూరి జయరాం 
  • తిరుపతి - కోనేటి ఆదిమూలం 


అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జీలు వీరే 

  • ఇచ్చాపురం - పిరియ విజయ 
  • టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్ 
  • చింతలపూడి -కంభం విజయ రాజు 
  • రాయదుర్గం - మెట్టు గోవింద రెడ్డి 
  • దర్శి - బూచేపల్లి శివప్రసాదరెడ్డి 
  • పూతల పట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్ 
  • చిత్తూరు - విజయానందరెడ్డి 
  • మదనపల్లె - నిస్సార్ అహ్మద్ 
  • రాజంపేట -ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి 
  • ఆలూరు - బూసినే విరూపాక్షి 
  • కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్ 
  • గూడూరు (ఎస్సీ ) -మేరిగ మురళి 
  • సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి 
  • పెనమలూరు - జోగి రమేష్ 
  • పెడన - ఉప్పాల రాము 


శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.