మూడో విడత నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు పూర్తి : అడిషనల్ కలెక్టర్ నగేశ్

మూడో విడత నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు పూర్తి : అడిషనల్ కలెక్టర్ నగేశ్
  • అడిషనల్​ కలెక్టర్ నగేశ్ 

కౌడిపల్లి, వెలుగు: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అడిషనల్​ కలెక్టర్ నగేశ్ తెలిపారు. మంగళవారం కౌడిపల్లిలో నామినేషన్ స్వీకరణ ఏర్పాట్లను పరిశీలించారు. 

మూడో విడతలో ఏడు మండలాలో ఎన్నికలు జరగనున్నాయని, కౌడిపల్లి లో 35 గ్రామ పంచాయతీలలో 35 సర్పంచ్​, 280 వార్డు సభ్యులకు నామినేషన్ల స్వీకరణకు ఏడు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నామినేషన్లు వేయాలనుకున్న వారు చివరి వరకు వేచి చూడకుండా ముందుగానే వేస్తే రద్దీ లేకుండా ఈజీగా ఉంటుందన్నారు. ఆయన వెంట ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ ఉన్నారు.