- యాదాద్రి జిల్లాలో 124 పంచాయతీలకు 147 సర్పంచ్ నామినేషన్లు వార్డులకు 641
యాదాద్రి, వెలుగు: మూడో దశలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లోని 124 పంచాయతీలు, 1086 వార్డులకు మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం సాయంత్రం 5 వరకూ క్లస్టర్లోనికి వచ్చిన వారికి నామినేషన్లు వేయడానికి ఎన్నికల స్టాఫ్ టోకెన్లు ఇచ్చారు. అనంతరం వచ్చిన వారికి టోకెన్లు ఇవ్వడానికి నిరాకరించారు.
147 నామినేషన్లు
రెండో రోజైన బుధవారం 124 పంచాయతీలకు 147 నామినేషన్లు రాగా వార్డులకు 641 నామినేషన్లు వచ్చాయి. ఇప్పటివరకూ మొత్తం పంచాయతీలకు 281, వార్డులకు 888 నామినేషన్లు దాఖలు చేశారు.
మండలాల వారీగా బుధవారం దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. అడ్డగూడూరులోని 17 పంచాయతీలకు 10 నామినేషన్లు, 150 వార్డులకు 55 వచ్చాయి. చౌటుప్పల్‌లోని 26 పంచాయతీలకు 36 నామినేషన్లు రాగా 236 వార్డులకు 187 వచ్చాయి. గుండాలలోని 20 పంచాయతీలకు 24 రాగా, 182 వార్డులకు 101 దాఖలయ్యాయి. మోటకొండూరులోని 20 పంచాయతీలకు 28 రాగా, 170 వార్డులకు 103 నామినేషన్లు వేశారు.
మోత్కూరులోని 10 పంచాయతీలకు 14 రాగా, 88 వార్డులకు 60 దాఖలయ్యాయి. సంస్థాన్ నారాయణపూర్‌లోని 31 పంచాయతీలకు 35 రాగా, 260 వార్డులకు 135 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారంతో నామినేషన్ల దాఖలు ముగుస్తున్నందున చివరి రోజు ఎక్కువగా వస్తాయని ఎన్నికల ఆఫీసర్లు భావిస్తున్నారు.
