ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడతలో భారీగా నామినేషన్లు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడతలో భారీగా నామినేషన్లు

వెలుగు, నెట్​వర్క్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యులకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసేందుకు శుక్రవారం చివరి రోజు కావడంతో ఆయా కేంద్రాలకు అభ్యర్థులు తరలివచ్చారు. 

సాయంత్రం 5 వరకు వచ్చిన అభ్యర్థులకు అధికా రులు టోకెన్లు అందించి రాత్రి వరకు కూడా నామినేషన్లు స్వీకరించారు.​ ఈ నెల 6న అన్ని నామినేషన్లను అధికారులు పరిశీలించి చెల్లుబాటైన వాటిని ప్రకటిస్తారు. 7న అప్పీళ్లు స్వీకరించి, 8న పరిష్కరిస్తారు. 9న నామినేషన్ల విత్​డ్రా ఉంటుంది. మూడో విడత పోలింగ్ ​ఈ నెల 17న జరగనుంది.

మంచిర్యాల జిల్లాలో నామినేషన్ల వివరాలు 

మండలం    సర్పంచ్​    నామినేషన్లు    వార్డులు    నామినేషన్లు

భీమారం    11    106    94    219

చెన్నూర్​    30    249    244    619

జైపూర్​    20    202    186    615

కోటపల్లి    31    247    258    605

మందమర్రి    10    95    86    218

మొత్తం    102    899    868    2,276

ఆసిఫాబాద్ జిల్లాలో..

మండలం    సర్పంచ్    నామినేషన్లు    వార్డులు    నామినేషన్లు

కాగజ్ నగర్    28    194    266    734

ఆసిఫాబాద్    27    122    236    584

రెబ్బెన    24    148    214    562

తిర్యాణి    29    127    222    366

మొత్తం    108    591    938    2246

నిర్మల్ ​జిల్లా

మండలం    సర్పంచ్    నామినేషన్లు    వార్డులు    నామినేషన్లు 

కుభీర్    42    214    344    541

తానూర్​    32    160    268    508

భైంసా    30    170    258    541

ముథోల్​    19    97    166    340

బాసర    10    73    90    187

మొత్తం    133    714    1126    2268

ఆదిలాబాద్ జిల్లాలో..

మండలం    జీపీలు    నామినేషన్లు    వార్డులు    నామినేషన్లు

బోథ్    21    122    182    328

సొనాల    12    46    96    155

బజార్ హత్నూర్    31    126    244    382

నేరడిగొండ    32    134    252    390

గుడిహత్నూర్    26    110    208    354

తలమడుగు     29    120    238    459

మొత్తం    151    658    1220    2068