తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు, వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి  దర్శనం కోసం వైకుంఠలోని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి వెయిటింగ్ హాల్ నిండిపోయి బయట క్యూలో బారులు తీరారు భక్తులు. దాదాపు మూడు కిలోమీటర్లు మేర భక్తులు క్యూలో వేయిట్ చేస్తున్నారు.  ఆళ్వార్ ట్యాంక్ మీదుగా లేపాక్షి సర్కిల్, రాంబగీవా బస్టాండ్ నుంచి నందకం అతిథి గృహం వరకు భక్తులు లైన్ లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి దాదాపు 25 గంటల టైం పడుతుండగా,  ప్రత్యేక దర్శనంకు నాలుగు గంటల సమయం పడుతోంది.