రోజూ 40 మంది ఫోన్లను ట్యాప్ చేసిన తిరుపతన్న

రోజూ 40 మంది ఫోన్లను ట్యాప్ చేసిన తిరుపతన్న

ఫోన్ టాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు,  భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు తిరుపతన్న. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లతోపాటు 20 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకుని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ప్రతి రోజు తిరుపతన్న 40 మంది సెల్ ఫోన్లను టాపింగ్ చేసినట్లుగా సమాచారం. 

మూడు ఉప ఎన్నికలతోపాటు గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్  గా పని చేశారు తిరుపతన్న.  కొన్ని సందర్భాల్లో ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ తో కలిసి తిరుపతన్న పనిచేసినట్లుగా తెలుస్తోంది. ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించారు తిరుపతన్న.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ వేశారు భుజంగరావు, తిరుపతన్న.  గతంలో వీళ్లు వేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.  ఈ క్రమంలో మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు  భుజంగరావు, తిరుపతన్న. వీరి  బెయిల్ పిటిషన్లపై రేపు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది.