ఇటీవల ‘ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంతో విజయాన్ని అందుకున్న తిరువీర్.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఐశ్వర్య రాజేష్‌తో కలిసి నటిస్తున్న సినిమా ఒకటి. కొత్త దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ‘ఓ..! సుకుమారి’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ డిజైన్ ఆకట్టుకుంది.
హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నామని మేకర్స్ తెలియజేశారు. ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సి.హెచ్. కుషేందర్ డీవోపీగా వర్క్ చేస్తుండగా కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. పూర్ణాచారి పాటలు రాస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
