ఈ పంద్రాగస్టు నినాదం..ఫ్రీడం ఫ్రం వైరస్

ఈ పంద్రాగస్టు నినాదం..ఫ్రీడం ఫ్రం వైరస్

న్యూఢిల్లీ: ‘‘కరోనా వైరస్ ముప్పు ఇంకా పోలేదు. ఎందుకంటే ఇది బిగినింగ్ మాత్రమే. ఈ పంద్రాగస్టుకు కరోనా పీడ విరగడవ్వాలని కోరుకుంటూ ప్రజలంతా దీక్ష పట్టాలె’’ అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తీవ్రత పెరిగిందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలు ప్రాంతాలకు వేగంగా పాకుతూ వార్నింగ్ బెల్స్ పంపుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారంమన్‌‌కీ బాత్ లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశిం చి ప్రధాని ప్రసంగించారు. ‘‘కరోనాకారణంగా.. ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు చాలా డిఫరెంట్గా జరగనున్నాయి.
కరోనా నుంచి స్వే చ్ఛ పొందాలని ప్లెడ్జ్చేయండి. స్వావలంబనకు సంకల్పం తీసుకోండి.. నేర్చుకోవటానికి, నేర్పడానికి, మన డ్యూటీని ఉత్సాహంగా చేసేందుకు తీర్మానం చేసుకోండి’’ అని కోరారు.

రికవరీలో మనమే బెస్ట్

‘‘కరోనా రికవరీ రేటు విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మన స్తే దేశం మెరుగ్గా ఉంది. డెత్ రేటు కూడా తక్కువగా ఉంది. మనం లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడాం’’ అని కామెంట్ చేశారు. రాఖీ పండుగ రానుందని, పలు సంఘాలు, ప్రజలు రక్షాబంధన్‌‌ను ఈసారి విభిన్నంగా జరుపుకునేందుకు ప్రయత్నించడం హరణీయమ ్ష న్నారు. లడఖ్, కచ్ ప్రాంతాలు కరోనా స్ప్రెడ్ ను అడ్డుకునేందుకు విభిన్నమైన పద్ధతులను అనుసరిస్తున్నాయనికొనియాడారు. గ్రామాల్లో కూడా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎంతో బాగా పని చేస్తున్నారన్నారు.

మాస్క్ తో ఇబ్బంది అనుకుంటే ఎట్ల?

మాస్క్ వేసుకోవడం పెద్ద ఇబ్బందిగా ఫీలయ్యే వారి గురించి మోడీ ప్రస్తావించారు. ‘‘కొన్నిసార్లుమనకు మాస్క్తో ప్రాబ్లమ్స్ వస్తాయి. మాస్క్ తీసేయాలని మీకు అనిపించినప్పుడు.. ఒక్కసారి డాక్టర్లు, ఇతర కొవిడ్ వారియర్ల‌ను గుర్తుతెచ్చుకోండి. పేషెంట్లకు ట్రీట్మెంట్చేస్తూ దాదాపు10 గంటలు వాళ్లుపీపీఈ కిట్లలోనే ఉంటారు. మరి వాళ్ల‌కు ప్రాబ్లమ్ కాదా?’ ’అని ప్రశ్నించారు. ‘‘మాస్క్లు వేసుకోండి. 2 గజాల
దూరం పాటించండి. చేతులు తరచూ కడుక్కోండి. ఎక్కడా ఉమ్మేయకండి. క్లీన్ క్లీ గా ఉండండి. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఇదే మనకు ప్రొటక్షన్’’ అని పీఎం సూచించారు.