
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ వారం కూడా థియేటర్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటనేవి చూద్దాం.
థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్..
వ్యూహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వర్మ తెరకెక్కించిన మూవీ వ్యూహం..పలు వివాదాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా రిలీజ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. వ్యూహం మూవీలో జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా..వైఎస్ భారతి పాత్ర లో మానస రాధాకృష్ణన్ నటిస్తుంది. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మించారు.
సుందరం మాస్టారు
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నిర్మిస్తోన్న మూవీ సుందరం మాస్టార్ (Sundaram Master). కమెడియన్ హర్షా చెముడు( Harsha chemudu) ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుందరం మాస్టరు స్టోరీ విషయానికి వస్తే..
అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే ఒక గిరిజన గ్రామానికి..అసలు ఈ మాత్రం ఇంగ్లీషే రాని ఒక సోషల్ మాస్టర్ ను ప్రభుత్వం ఏరికోరి పంపుతుంది. అందుకు కారణం అతడు చూడటానికి నల్లగా ఉండటమే. అతడే సుందరం.ఇక ఆ గ్రామంలో అమ్మాయిలకు నల్లవారు అంటే అదోరకమైన మక్కువ. అందుకే సుందరాన్ని అతిసుందరుడు గా భావించి రాచ మర్యాదలు చేస్తూ ఉంటారు గిరిజనులు. అయితే సుందరాన్ని ఆ ఊరికి పంపడానికి కారణం..ఆ ఊరిలో ఏదో తెలియని రహస్యం ఉందని సుందరానికి తెలుస్తోంది. ఆ రహస్యం ఏంటీ? అనేది మిగతా కథ.
సిద్ధార్థ్ రాయ్:
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ తరహాలో వస్తోన్న సిద్ధార్థ్ రాయ్ (Siddharthroy). బలమైన భావోద్వేగాలతో కూడిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన వి యశస్వి (V Yeshasvi)..ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
మహేశ్ బాబు అతడు మూవీలో కమెడియన్ బ్రహ్మానందం పొట్టపై చిన్న పంచ్ ఇచ్చి..మన స్కూల్ బెంచ్‌లా ఎంత గట్టిగా ఉందోరా..అనే డైలాగ్తో ఆకట్టుకున్న బుడ్డోడు అందరికీ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే. అతడులో నటించిన అతనే దీపక్ సరోజ్ (Deepaksaroj). ఇప్పుడు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రాయ్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు.
మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!
అభినవ్ గోమఠం హీరోగా నటించిన చిత్రం 'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!' (Masthu Shades Unnay Ra). ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీనికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించారు.
సైరన్
కోలీవుడ్ స్టార్ హీరో జయం లేటెస్ట్ మూవీ ‘సైరన్’. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు. రవి ఆంథోని భాగ్యరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మూలి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 23న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ముఖ్య గమనిక
అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా వేణు మురళీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ముఖ్య గమనిక. లావణ్య హీరోయిన్. రాజశేఖర్, సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది.
ఆర్టికల్ 370
కాశ్మీర్ హింస, తీవ్రవాదంపై అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆర్టికల్ 370 (Article 370) మూవీ ఇందుకు భిన్నం. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లో ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది. ఇందులో ఓ పవర్‌ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా యాక్షన్ అవతారంలో యామి గౌతమీ నటించింది. జిహాదీ పేరుతో కశ్మీర్‌లో సాగించే భారీ వ్యాపారంపై..అలాగే జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ప్రధాన అంశంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కునున్నట్లు తెలుస్తోంది.
ఆర్టికల్ 370 కథ విషయానికి వస్తే..
జమ్ము కశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ని భారత ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసింది. దీంతో జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక స్టేటస్‍ను ఎత్తేస్తూ..భారత ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కూడా అక్కడ చాలా విధాలుగా నిరసనలు జరిగాయి. అయితే, కొన్నాళ్లకు శాంతి భద్రతలను..కొంతమేరకు స్వేచ్ఛను ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. ఈ అంశంపైనే ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
భ్రమయుగం
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) హీరోగా భ్రమయుగం (Bramayugam) తెలుగులో ఫిబ్రవరి 23 న థియేటర్లో రిలీజ్ కానుంది. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ హారర్ థ్రిల్లర్‌పై ఆడియన్స్లో మంచి అంచనాలున్నాయి.