దీన్ని ప్రజల మనోభావాలకు ఇచ్చే గౌరవం అనరు

దీన్ని ప్రజల మనోభావాలకు ఇచ్చే గౌరవం అనరు

ఎనిమిదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహిస్తామని వీళ్లు ఏనడూ చెప్పలేదన్న ఆయన... ఇప్పుడు నేనంటే నేనని పోటీ పడుతున్నారని విమర్శించారు. దీనిని ప్రజల మనోభావాలకు ఇచ్చే గౌరవం అనరని, పచ్చి అవకాశవాద రాజకీయం అంటారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే ఈ సారి కేంద్ర ప్రభుత్వమే ఈ పనిని చేసేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడుతూ వస్తోన్న ఈ కార్యక్రమాన్ని తామే చేసి చూపిస్తామన్నట్టుగా ఈ ఏడాది పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇక ఈ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఏడాది పాటు నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలోని ప‌లు శాఖ‌ల‌ ఉన్నతాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వహించి వారికి పలు సూచనలు జారీచేశారు. సికింద్రాబాద్ లో ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.