రాష్ట్రంపై బీజేపీది సర్జికల్ స్ట్రైక్..ఎన్సీపీ కలిసే ప్రసక్తే లేదు

రాష్ట్రంపై బీజేపీది సర్జికల్ స్ట్రైక్..ఎన్సీపీ కలిసే ప్రసక్తే లేదు

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలిసి మీడియా సమవేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ నిర్ణయంతో ఎన్సీపీకి సంబంధం లేదన్నారు. అజిత్ పవార్  ఎమ్మెల్యేలను మోసం చేసి రాజ్ భవన్ కు తీసుకెళ్లారన్నారు. అజిత్ పవార్  నిర్ణయం పార్టీ క్రమశిక్షణ రాహిత్యమన్నారు.  ఆయనతో 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు వెళ్లారని..వెళ్లిన వారికి అజిత్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియదన్నారు. ఆయనతో వెళ్లిన ఎమ్మెల్యేలలో ముగ్గురు తమతో టచ్ లో ఉన్నారన్నారు. అజిత్ పవార్ తో వెళ్లిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

ఎన్సీపీ,శివసేన,కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. తమకు కొంతమంతి ఇండిపెండెంట్ సభ్యులతో కలిపి 170 మంది ఎమ్మెల్యేల మద్దతుందన్నారు. బీజేపీతో ఎన్సీపీ ఎప్పటికీ కలవబోదన్నారు. బలపరీక్షలో బీజేపీ ప్రభుత్వం పడిపోతుందని..మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందన్నారు. ఇవాళ సాయంత్రం జరిగే ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో అజిత్ పవార్  తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు శరద్ పవార్.

బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసింది: ఉద్ధవ్ థాక్రే

బీజేపీ అన్ని రూల్స్ తుంగలో తొక్కిందన్నారు ఉద్ధవ్ థాక్రే. ఎన్సీపీ,కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్తామన్నారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసిందన్నారు. బీజేపీ కుట్ర బయటపడిందన్నారు.