గ్యాస్ ట్రబుల్‌తో బాధపడేవారికి ఈ జ్యూస్ చాలా బెటర్

గ్యాస్ ట్రబుల్‌తో బాధపడేవారికి ఈ జ్యూస్ చాలా బెటర్

ఈ మధ్యకాలంలో పాతికేళ్ల వయసు నుంచే గ్యాస్ట్రిక్ ట్రబుల్​, అల్సర్, మలబద్ధకం వంటి ప్రాబ్లమ్స్​తో బాధపడుతున్నారు. వాటి నుంచి బయటపడాలంటే పరగడుపున అరుగుదలనిచ్చే ఏదైనా జ్యూస్ తాగాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. 

అరుగుదల కోసం
ఫ్రూట్స్, వెజిటబుల్స్​, మూలికలతో తయారుచేసిన జ్యూస్​లు తాగాలి. వాటివల్ల అరుగుదలే కాదు, శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ కూడా వస్తుంది. అలాగని వీటిని ఎప్పుడుపడితే అప్పుడు తాగకూడదు. దానికి ఒక టైం పాటించాలని చెబుతున్నారు డైటీషియన్లు. అప్పుడే న్యూట్రియెంట్స్ అన్నీ బాడీకి సరిగా అందుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాకపోతే రెగ్యులర్​గా తాగే జ్యూస్​లు కాకుండా వాటితోపాటు కొద్దిగా అల్లం, పసుపు, గోధుమ గడ్డి, నిమ్మకాయ రసం, యాపిల్​ సిడార్ వెనిగర్​ వంటివి కలపాలి. డైటింగ్​ చేసే వాళ్లు చాలామంది ‘కూరల్లో పసుపు, అల్లం టీ వాడుతుంటాం కదా. స్పెషల్​గా ఈ జ్యూస్​లు తాగడం ఎందుకు?’ అనుకుంటారు. కానీ, వాటిని అలాకాకుండా జ్యూస్​లా ఖాళీ కడుపుతో తాగితేనే హెల్త్​కి మంచిది. ఈ జ్యూస్​ల వల్ల బరువు కూడా తగ్గుతారట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్, న్యూట్రియెంట్స్​ ఫుల్​గా ఉంటాయి. పైగా ఇవి కడుపులో మంట రాకుండా చేస్తాయి. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తాయి. 

అన్నింటికీ ఒకటే ప్రాసెస్
ఈ జ్యూస్​లు రోజుకి రెండుసార్లు తాగాలి.  పరగడుపున ఒకసారి తాగాలి. రెండోది ఎప్పుడు తాగాలనేది ఎక్స్​పర్ట్స్​ సలహా తీసుకోవాల్సిందే. 100 ఎం.ఎల్​ నీళ్ల​లో పసుపు, నల్ల మిరియాలు, అరటీ స్పూన్ వేడి నెయ్యి వేసుకుని తాగాలి. గోధుమగడ్డిని ఉసిరి, అల్లం, నిమ్మ రసాలను కలుపుకుని తాగాలి.
బీట్​రూట్, ఆపిల్​​: బీట్​రూట్​, ఆపిల్​ జ్యూస్​లో రెండు టేబుల్​ స్పూన్​లు పైన చెప్పినవాటిని కలపాలి. హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. 
గోధుమ గడ్డి: ఇందులో ఉన్న బీటా కెరోటిన్​, విటమిన్​ - సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బయాటిక్​ ప్రాపర్టీస్​ అల్సర్​ని తగ్గిస్తాయి.
ఉసిరి, అల్లం: ఒక టీ స్పూన్ ఉసిరి జ్యూస్​లో అల్లం, తేనె వేసుకుని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే కండరాల నొప్పుల నుంచి రిలీఫ్ కోసం యాపిల్​ సిడార్​ వెనిగర్​ తాగాలి.  ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్​ సిడార్​ని డైల్యూట్ చేయకపోయినా, లేదా ఎక్కువ వేసుకున్నా జీర్ణకోశం దెబ్బతింటుంది. 

వీటితో కలిగే లాభాలు

  •   యాపిల్​ సిడార్ వెనిగర్ జ్యూస్​ని డైల్యూట్​ చేయకుండా తాగితే, గొంతు, కడుపు మంట వస్తుంది. 
  •   కొందరికి నిమ్మ గడ్డి, గోధుమ గడ్డితో చేసిన పదార్థాలు తిన్నా, తాగినా అలర్జీ వస్తుంది. అలాంటి వాళ్లు వీట్​గ్రాస్​ తాగొద్దు.
  •   ఏ జ్యూస్​ అయినా ఎక్కువ మోతాదులో తాగితే ఎసిడిటీ, లూజ్​ మోషన్స్​, తలనొప్పి వంటివి వస్తాయి. 
  •   ఈ జ్యూస్​లను పరగడుపున తీసుకుంటే మంచిది. అది కూడా 50 నుంచి 175 మిల్లీ లీటర్లు మాత్రమే తీసుకోవాలి.