ఈ వర్షాకాలంలో మోడల్ గుజరాత్ స్వరూపం బట్టబయలు

ఈ వర్షాకాలంలో మోడల్ గుజరాత్ స్వరూపం బట్టబయలు

గుజరాత్ లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలువలు, చెరువులు ఉప్పొంగి సామాన్యున్ని అతలాకుతలం చేస్తున్నాయి. అంతే కాకుండా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. వానల దాటికి రహదారులన్నీ దెబ్బతిని ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పేర్కొన్న ప్రకారం ఇది అహ్మదాబాద్ లో జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎడతెరపిలేకుండా కురిసిన వానలకు రోడ్డు కుంగిపోయి ప్రమాదకర స్థితికి చేరుకుంది. అప్పటికే డేంజర్ పొజిషన్ లో కనిపిస్తున్న ఆ రహదారి... అకస్మాత్తుగా మరింత కుంగిపోయి రోడ్డుకు మధ్యలో భారీగా గుంత పడింది. ఆ సమయంలో అక్కడ్నుంచి ఎవరూ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ వీడియోను హితేంద్ర పితాదియా షేర్ చేయడంతో పాటు.. ఈ వర్షాకాలం మోడల్ గుజరాత్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేశాయని,  ఇది స్మార్ సిటీ అహ్మదాబాద్ అనే సెటైరికల్ క్యాప్షన్ ను జత చేశారు.