
వెంకటేష్, రానా కలిసి నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. రెండేళ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌కు యూత్‌నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘రానా నాయుడు 2’ను రూపొందించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేశారు.
కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రానా మాట్లాడుతూ ‘సీజన్ వన్ కంటే సీజన్2 మరింత వైల్డ్‌గా ఉంటుంది. పాత్రలు మరింత లోతుగా ఉంటాయి.
ఫస్ట్ సీజన్‌ను ప్రపంచమంతా చూసింది కానీ తెలుగువాళ్లు ఆసక్తి చూపించలేదు. అందుకే ఈసారి బూతులు తగ్గించి, వయెలెన్స్ ఎక్కువ పెంచాం’ అని చెప్పాడు. ఇందులో నటించిన అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ ‘రవుఫ్ పాత్రలో నటిస్తూ చాలా ఎంజాయ్ చేశా. ఎలాంటి భయం లేని రానా నాయుడుకి ఈ సీజన్‌లో చాలా కష్టాలుంటాయి.
రానాతో వర్క్ చేయటం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక వెంకటేష్ గారు చాలా సరదాగా ఉంటారు. నెట్‌ఫ్లిక్స్‌లో నేను చేసిన మొదటి సిరీస్ కావటంతో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని చెప్పాడు. సుర్వీన్ చావ్లా, కృతి కర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా తదితరులు ఈ సిరీస్‌లో నటించారు.